Kiran Abbavaram : మరీ ఇంత స్పీడ్ అయితే ఎలా రాజు గారు.. రాణి వారు తల్లి కాబోతుందట..!
ప్రధానాంశాలు:
Kiran Abbavaram : మరీ ఇంత స్పీడ్ అయితే ఎలా రాజు గారు.. రాణి వారు తల్లి కాబోతుందట..!
Kiran Abbavaram : తెలుగు చిత్ర పరిశ్రమకు కిరణ్ అబ్బవరం Kiran Abbavaram కథానాయకుడిగా పరిచయమైన సినిమా రాజా వారు రాణి గారు. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అమ్మాయి రహస్య గోరఖ్. ఆమెతో కలిసి తొలి సినిమా చేయడమే కాదు… ఆ సినిమా చిత్రీకరణలో జరిగిన పరిచయం వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత పెళ్లి పీటల మీద కూర్చునేలా చేసింది. గత ఏడాది (2024లో) మార్చి 31న కిరణ్ అబ్బవరం, Kiran Abbavaram రహస్య గోరఖ్ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, కొంత మంది సన్నిహితులు శ్రేయోభిలాషుల సమక్షంలో కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు రహస్య ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేశారు. ‘మా ప్రేమ రెండు అడుగులు పెరిగింది’ అని కిరణ్ అబ్బవరం Kiran Abbavaram పేర్కొన్నారు.
Kiran Abbavaram గుడ్ న్యూస్..
కిరణ్ అబ్బవరం Kiran Abbavaram తన భార్య రహస్య గోరఖ్ గర్భవతి అయిందని ప్రకటించాడు. తన భార్య రహస్యతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు కిరణ్. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కిరణ్ – రహస్య జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజావారు రాణిగారు సినిమా సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడి ఆల్మోస్ట్ 5 ఏళ్ళు ప్రేమించుకొని గత సంవత్సరం ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సింపుల్ గా ఇరు కుటుంబాల మధ్యే చేసుకోగా, కిరణ్ సొంతూళ్లో మాత్రం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు.
రహస్యతో వివాహం తర్వాత కిరణ్ అబ్బవరం జీవితంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. పెళ్లి చేసుకోవడానికి ముందు అతను యాక్సెప్ట్ చేసిన ‘రూల్స్ రంజన్’ ఫ్లాప్ అయినప్పటికీ… ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’తో భారీ విజయం అందుకున్నారు. ఈ చిత్రానికి కిరణ్ భార్య రహస్య నిర్మాణపరమైన విషయాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.