Allu Arjun : అల్లు అర్జున్‌కు చుక్కెదురు.. రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని నాంపల్లి కోర్టును కోరిన పోలీసులు
ప్రధానాంశాలు:
Allu Arjun : అల్లు అర్జున్‌కు చుక్కెదురు.. రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని నాంపల్లి కోర్టును కోరిన పోలీసులు
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ Allu Arjun కి చుక్కెదురు ఎదురైన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ లో ప్రీమియర్స్ వేయగా, ఈ షోకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారు. దాంతో అల్లు అర్జున్ ను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు పోటెత్తారు. దాంతో తొక్కిసలాట జరిగింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు డిసెంబర్ 13న 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీనిపై అల్లు అర్జున్ తరపున అడ్వొకేట్లు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు, క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు బెయిల్ వచ్చినా మర్నాడు ఉదయం చంచల్‌గూడ నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు.
Allu Arjun బన్నీకి చిక్కులు..
అల్లు అర్జున్ డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల వాదనగా తెలుస్తుంది.అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని, ఇప్పుడు మళ్లీ బెయిల్ ఇస్తే ఇప్పుడు కూడా విచారణకు సహకరించకపోవచ్చని తమ వాదనల్లో పేర్కొన్నారు పోలీసులు. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో ఆ రోజు వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు అల్లు అర్జున్. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టు జనవరి 10న విచారణ జరపనుంది. అల్లు అర్జున్ రిమాండ్‌పైనా అదే రోజు విచారణ జరగనుంది.
పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఆమె మరణించగా…శ్రీతేజ్ కిమ్స్ ఆసపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దొని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. అతను డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని…బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలా అయితే మొత్తం కేసు తారు మారు అవుతుందని…అందుకే అతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోరుతున్నారు. అంతకు ముందు అల్లు అర్జున్ పీఎస్‌లో కూడా సహకరించలేదని…అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే ఇదే పరిస్థితి మళ్ళీ ఎదురౌతుందని..కేసుకు అస్సలు సహకరించే అవకాశం ఉందడదని పోలీసులు వాదిస్తున్నారు