Kota Srinivasa Rao : జూనియర్ ఎన్టీఆర్‌ని పైకెత్తుతూ మెగా ఫ్యామిలీని దారుణంగా విమర్శించిన కోట శ్రీనివాసరావు
Kota Srinivasa Rao : విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల కాంట్రవర్సీస్‌తో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు. ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద హీరోలపై కూడా షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ని పైకి ఎత్తుతూ మెగా ఫ్యామిలీపై దారుణమైన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ‘నేటి తరంలో నాకు నచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. అతనికున్న పొటెన్షియాలిటీ మరొకరికి లేదు. మంచి నటులున్నారు. మహేష్, బన్ని వంటి వారున్నారు. కానీ అతనిలా కాదు. వీళ్లు మంచి నటులే. కాదనను. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్‌ను రిప్లేస్ చేశాడుగా.
జూనియర్ ఎన్టీఆర్ అని అనుకుంటున్నారుగా. వాక్ శుద్ధి ఉంది. డైలాగ్ బ్రహ్మాండంగా చెబుతాడు. డాన్సులు చేస్తాడు. మంచి మెమొరీ ఉంది. రామ్ చరణ్ తేజ్ చిరంజీవిగారబ్బాయి అవటం వల్ల అతనికి అంత పేరుంది. కానీ నటుడిగా అంత పొటెన్షియాలిటీ ఎక్కడా కనపడలేదు. మంచి నటుడే అయ్యుండొచ్చు కానీ ఎక్కడా వేషాలు కనపడలేదు’’ అన్నారు. అయితే కోట శ్రీనివాస రావు చేసిన ఈ కామెంట్లతో కొందరు మెగా అభిమానులు అంతృప్తికి లోనవుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఆయనపై దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు.ఇక ఇటీవల చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
kota srinivasa rao comments on Jr ntr
Kota Srinivasa Rao : కోట ఇలా అనేశాడేంటి..!
చిరంజీవి సినీ కార్మికుల కోసం హాస్పిటల్ కడతారనే దానిపై కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ముందు సినీ కార్మికులకు తిండి పెట్టండి. నీ హాస్పిటల్‌కి ఎవడొస్తాడు. నాకు పని ఉందనుకోండి. నాలుగు డబ్బులొస్తాయి. అపోలో హాస్పిటల్‌కే వెళతారు. ఎంత టాలెంట్ అలా కృష్ణానగర్‌లో చాలా మంది దర్శకులు పని లేక తాగుడు తందనాలతో పాడైపోతున్నారు. హాస్పిటల్ లాంటి కబుర్లెందుకు. నాకు చిరంజీవిగారంటే చాలా గౌరవం. నేను కూడా కార్మికుడినే అని అంటున్నారు. కోట్లు తీసుకుని సినిమాలు చేసే వ్యక్తి కార్మికుడు ఎలా అవుతాడు. ఎందుకా మాటలన్నీ. ఏదైనా సాయం చేయాలనిపిస్తే చేయాలంతే. ఇప్పటి వరకు ఐదారు లక్షలు ఆర్టిస్టులకు సాయం చేసుంటాను’’ అన్నారు.