Krish : క్రిష్ ఫ్లాపుల్లో ఉన్నాడు.. ఫస్ట్ సినిమాతో రికార్డ్స్ బద్దలు కొట్టిన ఆ హీరోనే ఆదుకోవాలి ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krish : క్రిష్ ఫ్లాపుల్లో ఉన్నాడు.. ఫస్ట్ సినిమాతో రికార్డ్స్ బద్దలు కొట్టిన ఆ హీరోనే ఆదుకోవాలి ..?

 Authored By govind | The Telugu News | Updated on :21 February 2021,2:50 pm

Krish : క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలు దారుణంగా పరాజయాన్ని మూట కట్టుకున్నాయి. నందమూరి తారకరామారావు బయోపిక్ గా ఆయన నట వారసుడు నందమూరి బాలకృష్ణతో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహనాయకుడు’ సినిమాలను తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్స్ గా మిగిలాయి. దాంతో క్రిష్ పరిస్థితి ఏంటీ అనుకుంటున్న సమయంలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను ప్రకటించాడు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రెండవ సినిమా తెరకెక్కించాడు.

krish is already in flop this new hero has to save him

krish-is-already-in-flop-this-new-hero-has-to-save-him

లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా కేవలం 45 రోజుల్లోనే టాకీ పార్ట్ కంప్లీట్ చేశాడు క్రిష్. అయితే ఉప్పెన కంటే ముందే ఈ సినిమా రిలీజ్ అవుతుందని భావించారు. కాని క్రిష్ గత చిత్రాలు ఫ్లాప్ అయి ఉండటం తో మెగాస్టార్ చిరంజీవి జడ్జ్ చేసి బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాగా రిలీజ్ చేయమని చెప్పిన ఉప్పెన సినిమాని మేకర్స్ ముందు రిలీజ్ చేశారు. ఈ సినిమా 20 ఏళ్ళకి పైగా ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ క్రియేట్ చేసిన ఈ రికార్డ్ ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేయలేరని చెప్పుకుంటున్నారు.

Krish : క్రిష్ కి హిట్ దక్కుంతుందేమో చూడాలి..?

ఇక ఇదే క్రేజ్ ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న క్రిష్ ప్లస్ కాబోతుందని అంటున్నారు. క్రిష్ – వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాకి కొండపొలం అన్న టైటిల్ ని అనుకుంటుండగా త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించబోతున్నారు. కాగా ఈ మెగా హీరోకి డెబ్యూ సినిమాతో వచ్చిన క్రేజ్ తోనే ఈ సినిమా మీద అంచనాలున్నాయని చెప్పుకుంటున్నారు. మరి ఆ క్రేజ్ తో ఫ్లాపుల్లో ఉన్న క్రిష్ కి హిట్ దక్కుంతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. మన్మధుడు 2 లాంటి భారీ డిజాస్టర్ తర్వాత టాలీవుడ్ లో రకుల్ గ్రాఫ్ పడిన సంగతి తెలిసిందే.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది