Krishna Bhagawan : జబర్దస్త్‌ లో కొత్త జడ్జ్ కృష్ణ భగవాన్‌ యొక్క పారితోషికం ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krishna Bhagawan : జబర్దస్త్‌ లో కొత్త జడ్జ్ కృష్ణ భగవాన్‌ యొక్క పారితోషికం ఎంతో తెలుసా?

 Authored By aruna | The Telugu News | Updated on :24 September 2022,8:00 pm

Krishna Bhagawan : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో కొత్త జడ్జిగా ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్ సందడి చేస్తున్నారు. ఇంద్రజ మరియు కృష్ణ భగవాన్ గత రెండు మూడు వారాలుగా కంటిన్యూగా జడ్జిలుగా కంటిన్యూ అవుతున్నారు. దాంతో ఇక మీదట కృష్ణ భగవాన్ పర్మినెంట్ జడ్జ్‌ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. అప్పుడప్పుడు సింగర్ మనో వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్ యొక్క పర్మినెంట్ జడ్జ్ సీట్లో ఒకానొకప్పటి స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్ కూర్చునే అవకాశం కనిపిస్తుంది.

ఇప్పటికే ఆయన వరుసగా ఎపిసోడ్ మీద ఎపిసోడ్లు చేస్తున్నాడు. మల్లెమాల మరియు ఈటీవీ వర్గాల ద్వారా మాకు అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఇంద్రజ కంటే కృష్ణ భగవాన్ కి ఎపిసోడ్ పారితోషికం తక్కువ ఉంటుందట. ఇంద్రజ కి రెండున్నర లక్షల పారితోషికమిస్తే కృష్ణ భగవాన్ కి రూ.1.6 లక్షల నుంచి రూ.1.75 లక్షల పారితోషికం ఉంటుంది అంటూ ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది. కృష్ణ భగవాన్ గతంలో వచ్చిన వంశీ సినిమాల్లో మంచి కమెడియన్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Krishna Bhagawan Remuneration For One Episode In Jabardasth As A Judge

Krishna Bhagawan Remuneration For One Episode In Jabardasth As A Judge

సీనియర్ వంశీ సినిమాల్లో కృష్ణ భగవాన్ కి మంచి స్కోప్ ఇచ్చేవారు కానీ ఈ మధ్య కాలంలో కృష్ణ భగవాన్ స్థాయికి తగ్గట్లుగా పాత్రలు చేయడం లేదు. ఆయన కోసం దర్శకులు మరియు రచయితలు కథలను కూడా రాయడం లేదు. హీరోగా కూడా నటించి నేర్పించిన కృష్ణ భగవాన్ ఇప్పుడు సినిమాల్లో ఆఫర్లు లేక ఇలా బుల్లి తెరపై సందడి చేయాల్సి వచ్చింది. ఆయనకున్న స్టార్ట్డం తో ఇప్పటికి కూడా మంచి పారితోషకం దక్కుతున్నట్లుగానే భావించాలి. ఒక్కరోజు పారితోషికం లక్షన్నర అంటే పెద్ద విషయమే. జబర్దస్త్ కమెడియన్స్ ఎంతో మందికి 10,000 రూపాయలు పారితోషికం మాత్రమే ఇస్తారు. కృష్ణ భగవాన్ ఎన్ని ఎపిసోడ్ల వరకు కంటిన్యూ అవుతాడో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది