Krishna Bhagavaan : హైపర్ ఆదికి నోటి దూల.. వామ్మో పరువుతీసిన కృష్ణ భగవాన్
Krishna Bhagavaan : జబర్థస్త్ షో ప్రేక్షకులని ఎంతగా ఎంటర్‌టైన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కామెడీ షోకి జడ్జెస్, కంటెస్టెంట్స్ మారుతున్నా కూడా రేటింగ్ మాత్రం మంచిగానే రాబడుతుంది.ఎంతో మంది కమెడియన్లకు జీవితాన్ని ఇచ్చింది జబర్దస్త్. కమెడియన్లు ఎంతో మంది వచ్చి పోతున్నా.. జడ్జిలుగా నాగబాబు, రోజా ముందుండి షోను నడిపించారు. అయితే నిర్వాహకులతో విభేదాల కారణంతో నాగబాబు.. మంత్రి రావడంతో రోజా ఈ షోను వీడారు. ఆ స్థానంలో ఇంద్రజ, ఖుష్బూ వంటి వారు వచ్చి చేశారు. నాగబాబు స్థానంలో చాలా మంది మారారు.
మనో కొన్ని రోజులు జడ్జిగా ఉన్నారు. ఇక ఆ తర్వాత కృష్ణ భగవాన్ జడ్జిగా ఉంటున్నారు. ఆయన రాకతో షోకి కొంత బూస్టింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. తాజాగా జబర్ధస్త్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో ఆది, కృష్ణ భగవాన్ వీల్ చైర్‌లో వస్తారు. అప్పుడు కృష్ణ భగవాన్ వీల్ చైర్‌ని తోయకుండా నన్ను తోస్తావేంటని అనగా, దానికి ఆది.. మిమ్మల్ని అయిన అది తోస్తుంది, ఇదైతే నా వెనక ఏదేదో చేస్తుంది అని అన్నాడు. ఇక ఇంద్రజతో వర్క్ చేస్తున్నారుగా, అది ఎలా ఉందో అని ఆది అడగగా, ఆవిడకేంటి, ఎప్పుడు ఎవర్ గ్రీన్, గ్రీన్ సారి, గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకొని రావడం చాలా బాగుంటుందని కృష్ణ భగవాన్ అంటే దానికి పంచ్‌గా ఆది నిజంగా ఎవర్‌గ్రీన్ అంటారా అని అంటాడు.

Krishna Bhagavaan fun with Hyper Aadi
Krishna Bhagavaan : సెటైర్లే సెటైర్లు..
దానికి నవ్వులు పూస్తాయి. మన ఎదురుగా తమన్నా, పూజా హెగ్డే వెళితే మీరు ఎవరిని చూస్తారు అని ఆది అడగగా, నేను తమన్నాని చూస్తా అని కృష్ణ భగవాన్ అంటాడు .ఏంటి సార్ నేనైతే ఇద్దరిని చూస్తా అని ఆది అనగా, నేను అంత కక్కుర్తి పొజీషన్‌లో లేను అని అంటాడు. మన బాడీలో అన్ని పడిపోయి నోరు ఒక్కటే ఎందుకు ఉంచాడు అని ఆది అనగా, దానికి కృష్ణ భగవాన్ నోటిదూల ఉంది కాబట్టి అని పరువు తీసాడు . అది ఉంటే తప్పు అంటారా అని ఆది అడగ్గా, అది లేకపోతే తప్పుకోండని మనని అంటారు అంటూ కృష్ణ భగవాన్ పంచ్‌లు వేశాడు. ఏదేమైన ఇద్దరి మద్య కామెడీ సూపర్‌గా నడిచింది.
