Krishna Bhagavaan : జబర్దస్త్.. కృష్ణ భగవాన్ తక్కువ అయినా పర్వాలేదు అంటూ వస్తున్నాడట
Krishna Bhagavaan : ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్స్ కొత్త వారు వచ్చినట్లుగానే జడ్జ్ లు కూడా రెగ్యులర్ గా కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు. నాగబాబు మరియు రోజా లతో ప్రారంభం అయినా జబర్దస్త్ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎంతోమంది జడ్జ్ లు వచ్చి కామెడీని ఆస్వాదించి ఎంజాయ్ చేసి వెళ్లారు. కొంత మంది కొత్త వారు వస్తూనే ఉన్నారు. రోజా వెళ్లి పోయిన తర్వాత జడ్జ్ స్థానంలో ఏ ఒక్కరు నిలకడగా ఉండడం లేదు. ఆ మధ్య ఇంద్రజ పర్మినెంట్ జడ్జి అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల నిజం కాదని తాజా ఎపిసోడ్ తో తేలి పోయింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ మరియు ఈటీవీ ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్ కనిపిస్తున్నారు.
ఆయన సినిమాల్లో ఏ స్థాయిలో కామెడీని పండించినారో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆయనకు సినిమాల్లో ఆఫర్స్ తగ్గాయి. సీనియర్ దర్శకులు ముఖ్యంగా వంశీ వంటి వారు ఆయనకు అద్భుతమైన పాత్రలను ఇచ్చారు. కానీ ఇప్పటి దర్శకులు ఆయన గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో ఖాళీగా ఉంటున్న కృష్ణ భగవాన్ కి జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి అవకాశం అన్నట్లుగా లభించింది అందుకే తక్కువ పారితోషికం ఇచ్చినా కూడా జబర్దస్త్ కార్యక్రమానికి ఆయన వచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. మొదటి రెండు మూడు ఎపిసోడ్స్ కి ఇచ్చిన స్థాయిలో కాకుండా ఇప్పుడు తక్కువ పారితోషికం ఆయనకు ఇస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆయన టాలీవుడ్ లో సీనియర్ స్టార్ కమెడియన్ అనడం లో ఎలాంటి సందేహం లేదు ఆయన జడ్జి సీట్లో కూర్చున్న సమయం లో చాలా రసవత్తరంగా ఉన్న సమయంలో పంచ్ లు వేసి అందరిని నవ్విస్తూ ఉంటాడు. కామెడీ చేసే వారితో పాటు జడ్జ్ స్థానంలో కూర్చున్న వారు కూడా కామెడీ చేయడం వల్ల మంచి వినోదం ప్రేక్షకులకు దక్కుతుంది. అందుకే కృష్ణ భగవాన్ కంటిన్యూ అవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అలాగే ఆయన రెమ్యూనరేషన్ తక్కువ అవడం వల్ల ఈటీవీ మల్లెమాల వారు కూడా ఆయనను కంటిన్యూ చేసే ఉద్దేశంతో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.