Tollywood : వారిద్దరు విడిపోలేదు… అలాగని కలిసి కూడా లేరట! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tollywood : వారిద్దరు విడిపోలేదు… అలాగని కలిసి కూడా లేరట!

 Authored By aruna | The Telugu News | Updated on :30 August 2022,9:40 pm

Tollywood : టాలీవుడ్ సీనియర్ దర్శకుడు.. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ మరియు సీనియర్ హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్న రమ్యకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు కూడా ప్రేమ వ్యవహారం నడిపి కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరి సంసార జీవితం సాఫీగా సాగింది. ఇప్పటికీ కూడా సాగుతూనే ఉంది. అయితే కొందరు మాత్రం వీరి వైవాహిక జీవితం గురించి ఇష్టానుసారంగా మీడియాలో ప్రచారం చేస్తూ వారి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పలు సార్లు దర్శకుడు కృష్ణవంశీ మరియు నటి రమ్యకృష్ణ వివాదాల గురించి విభేదాల గురించి చివరకు విడాకుల గురించి కూడా మాట్లాడి అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ తేల్చి చెప్పారు.

తాజాగా దర్శకుడు కృష్ణవంశీ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి రమ్యకృష్ణకు మరియు తనకు విభేదాలు అంటూ వస్తున్న వార్తలపై నోరు విప్పాడు. మీడియాలో వస్తున్న పుకార్లు నిజం కాదని తామిత్తరం గొడవ పడడం లేదంటూ చెప్పుకొచ్చాడు. కానీ షూటింగులు ఇతర కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండడం వల్ల తను ఎక్కువగా చెన్నైలో ఉంటుందని, అలాగే తాను హైదరాబాదులో ఉండవలసి వస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే తప్పకుండా రెగ్యులర్గా మేము కలుస్తూనే ఉంటామని మా వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుందని కృష్ణవంశీ పేర్కొన్నాడు.

Krishna vamshi and Ramya Krishna react to divorce rumors

Krishna vamshi and Ramya Krishna react to divorce rumors

సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతకాలం దూరంగా ఉండాల్సి వస్తుందని, అంతమాత్రాన విభేదాలతో దూరంగా ఉన్నట్లు కాదని కొందరి ఇండస్ట్రీ వర్గాల వారు కృష్ణవంశీ మరియు రమ్యకృష్ణ యొక్క వ్యవహారం పై స్పందిస్తూ మాట్లాడుతున్నారు. మొత్తానికి రమ్యకృష్ణ మరియు కృష్ణవంశీ కలిసే ఉన్నారు, కానీ వారి వారి ప్రొఫెషన్స్ లో బిజీగా ఉండడం వల్ల వేరువేరుగా ఉంటున్నారని.. అలా వేరువేరుగా ఉండడం వల్ల మీడియా వారిద్దరు విడిపోయారంటూ కథనాలు అల్లేస్తుందని తెలుస్తోంది. ఇక కృష్ణవంశీ తాజా సినిమా విషయానికి వస్తే రంగమార్తాండ అనే సినిమాని గత రెండు మూడు సంవత్సరాలుగా చెక్కుతూనే ఉన్నాడు. వచ్చే ఏడాది ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి. ఇక రమ్యకృష్ణ తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలను చేస్తూనే ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది