krishnam Raju : కృష్ణంరాజు అంత్యక్రియలు చేసేంది ప్రభాస్ కాదు.. ఎవరంటే!
krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు నిన్న తెల్లవారు జామున హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. నిన్న అంతా కూడా ఆయన ఇంటి వద్ద సందర్శనార్థం ఉంచారు. నేడు మొయినాబాద్ వద్ద కనకమామిడి దగ్గర ఉన్న తన ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హీరో ప్రభాస్ చేతుల మీదుగా కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయని అభిమానులు అంతా భావించారు.
కానీ ప్రభాస్ కాకుండా ఆయన సోదరుడు ప్రభోద్ అంత్యక్రియలను నిర్వహించారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ప్రభాస్ కాకుండా ప్రభోద్ ఈ అంత్యక్రియలను నిర్వహించడం జరిగిందని సమాచారం అందుతుంది. ప్రభాస్ ని కృష్ణంరాజు తన సొంత కొడుకులా భావించేవారు. తన వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేసి ఇంత వాడు అవడంలో కీలకపాత్ర వహించారు. అందుకే కృష్ణంరాజుకి ప్రభాస్ అంత్యక్రియలు నిర్వహిస్తే గౌరవంగా ఉంటుంది, రుణం తీర్చుకున్నట్లుగా ఉంటుంది అని అంతా భావించారు.
కానీ ప్రభాస్ కొన్ని కారణాల వల్ల అంత్యక్రియలు నిర్వహించలేకపోయినట్లుగా సమాచారం అందుతుంది. దాంతో ప్రభోద్ చేతుల మీదుగా కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగిపోయాయి. కృష్ణం రాజుకు ముగ్గురు కుమార్తెలు అవ్వడంతో సోదరుని కుమారుడైన ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. కృష్ణంరాజు యొక్క సన్నిహితులు మరియు రాజకీయ ప్రముఖులు సినీ వర్గాల వారు ఎంతో మంది పెద్ద ఎత్తున అంత్యక్రియలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.