Ramesh Babu Krishna : నా కంటే ముందే వెళ్లిపోయావా.. కొడుకు భౌతిక ఖాయం వద్ద కృష్ణ కన్నీటి పర్యంతం..!
Ramesh Babu Krishna చెట్టంత కొడుకు కండ్ల ముందే చనిపోవడం ఆ తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. సూపర్ స్టార్ అనే స్థాయిని కూడా పక్కన పెట్టేసి కొడుకు శవం దగ్గర బోరుమని ఏడ్చేశాడు. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. ఈ రోజు ఆయన పెద్ద కొడుకు ఘట్టమనేని రమేశ్ బాబు చనిపోయిన విషయం తెలిసింద. దీంతో ఆయన పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోకు తీసుకు వచ్చారు. కాగా రమేశ్ బాబు పార్థివ దేహానికి కృష్ణ కన్నీటితో నివాళి అర్పించారు.
ఆయన పార్థివ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ.. ఈ వయసులో నాకు ఈ శిక్షేంటి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కంటే ముందే లోకాన్ని వీడిపోయావా అంటూ బాధ పడుతూ.. కొడుకు భౌతిక ఖాయం దగ్గరు ఉండిపోయారు. దీంతో ఆయన దీన పరిస్థితిని చూసి అక్కడకు వచ్చిన వారంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక టాలీవుడ్ మొత్తం రమేశ్ బాబు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

krishnas tears at his sons ramesh babu physical residence
ఇక తమ్ముడు మహేశ్ బాబు పద్మాలయ స్టూడియోకు రాలేదు. ప్రస్తుతం ఆయన కరోనా వచ్చి ఐసోలేషన్ లో ఉన్నారు. రమేశ్ బాబు ఎప్పటి నుంచో కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. అదే వ్యాధితో ఇబ్బంది పడుతూ.. పరిస్థితి విషమించి ఆస్పత్రికి తరలించే లోపే కన్ను మూశారు.