Balakrishna : చాలా తెలివిగా జూనియర్ ఎన్టీఆర్ ని దూరం చేస్తున్న బాలకృష్ణ..!
ప్రధానాంశాలు:
Balakrishna : చాలా తెలివిగా జూనియర్ ఎన్టీఆర్ ని దూరం చేస్తున్న బాలకృష్ణ - కె ఎస్ ప్రసాద్..!
Balakrishna : నందమూరి కుటుంబం గురించి కేఎస్ ప్రసాద్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పురందేశ్వరి నీ బాలకృష్ణ నెత్తెన పెట్టుకున్నారని, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడని అన్నారు. పురందేశ్వరికి నిలకడ ఉండదని, మొదట కాంగ్రెస్ లో చేరి తర్వాత బీజేపీలో చేరి పదవే పరమానందంగా తిరుగుతున్నారు అని ఎద్దేవా చేసారు. ఇక వైఎస్ షర్మిల, పురందేశ్వరి ఇద్దరూ ఒకటే అని, తెలంగాణలో పార్టీని పెట్టి దాని కాంగ్రెస్లో విలీనం చేసి ఇప్పుడు ఏపీలో అడుగు పెట్టి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా పదవి చేపట్టారు. వీరి వలన ఇంకొకరు సంక నాకి పోవడం తప్ప ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. ఇక నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని కైవసం చేసుకున్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావును అన్యాయం చేసి చంద్రబాబు నాయుడు పార్టీని ఎత్తుకెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఎప్పటికైనా పార్టీలోకి వస్తాడు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ మా తాత పార్టీలోకి ఎప్పుడైనా వస్తాను ఏ సమయానికైనా వస్తాను అని అన్నారు. ఇక ఎన్టీఆర్ ఘాట్ లో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చింపివేయడంలో కూడా స్పందించారు. సినిమా వాళ్లకి అహంకారం ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి అహంకారంతో వాటిని తొలగించారు. ఇక టీడీపీలో నారా లోకేష్ ను నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ ముందుకు వెళతాడా లేక వెనకకు వెళతాడు తెలుస్తుంది అని అన్నారు.
ఇక వైఎస్ షర్మిల జగన్ రెడ్డి అంటూ పిలవడంపై కూడా ఆయన స్పందించారు. అన్నా చెల్లెలు బంధంలో ఎలా అయినా పిలుచుకునే స్వాతంత్రం ఉంటుంది. కానీ ఆయన ఒక పదవిలో ఉన్నప్పుడు ఆయన చైర్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఆమెకు ఇలాంటి విమర్శలే వస్తాయి అని అన్నారు. తెలుగు రాష్ట్రాలను నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో జీరో అవుతుందని, వైయస్ షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ నారా లోకేష్ కి టీడీపీ పట్టం కట్టాలని చూస్తున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే నారా లోకేష్ పరిస్థితి ఏమవుతుందో అనే భయంతో చాలా తెలివిగా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతూ వస్తున్నారు అని అన్నారు.