
KTR Do you remember Ram Charan RRR movie
KTR : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు చరిత్రలో కలవని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే ఊహతో తెరకెక్కించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా భారత దేశ సినీ చరిత్రలో అనేక రికార్డులు తిరగ రాసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాపై ఇంట బయటా ప్రశంసల వర్షం కురిసింది. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. అయితే సినిమా విడుదలై చాలా రోజుల అయిన తర్వాత కేటీఆర్‌కి రామ్ చరణ్ పర్‌ఫార్మెన్స్ గుర్తొచ్చింది. ఆయన చరణ్ పర్‌ఫార్మెన్స్‌పై ఏమని కామెంట్ చేశాడో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి..
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంటుంది. ఈ సినిమాను అయిదు భారతీయ భాషలతో పాటు మరో అయిదు విదేశీ భాషల్లో కూడా విడుదల చేశారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా నెట్ ఫిక్స్ లో విడుదలైందో అప్పటి నుంచి విదేశీ ప్రేక్షకులు ఈ సినిమాకి ఫిదా అవుతున్నారు.సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నా ఇప్పటికీ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ సినిమాల జాబితాలో ఈ సినిమా నిలిచింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతి ఏడాది పది మంచి సినిమాలు లిఫ్ట్ చేసి వాటిలో ఒక దానికి ది బెస్ట్ మూవీ అని అవార్డు ప్రకటిస్తారు. అలా ఈ ఏడాది భారత దేశం నుంచి మన ఆర్ఆర్ఆర్ సినిమా చోటు దక్కించుకోవడం గమనార్హంఇటీవల జపాన్‌లో కూడా సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. గతంలో బాహుబలి సినిమాతో జపాన్ ఆడియన్స్‌ను అభిమానులుగా మార్చేసుకున్న జక్కన్న..
KTR Do you remember Ram Charan RRR movie
ఈ సారి అక్కడి నుంచి గ్లోబల్ టార్గెట్ సెట్ చేశారు. అక్టోబర్ 21న ఈ సినిమా జపాన్‌లో అక్కడి లోకల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ కానుంది.జపాన్ తరువాత చైనా రిలీజ్ మీద దృష్టి పెట్టనున్నారు మేకర్స్. ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ మార్కెట్ చైనానే. గతంలో బాహుబలి రికార్డ్ కలెక్షన్లు సాధించటం వెనుక చైనా కలెక్షన్లది మేజర్ రోల్. అందుకే ట్రిపులార్, చైనా రిలీజ్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.జపాన్, చైనాల్లోనూ RRR మూవీకి పాజిటివ్ టాక్ వస్తే… ఇండియన్ సినిమాలో మరో ఆల్ టైమ్ హయ్యస్ట్ కలెక్షన్ల రికార్డ్ ఖాయం అన్న అంచనా వేస్తున్నారు క్రిటిక్స్. బాహుబలి ఓవరాల్‌గా రూ.1800 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. ఆ తరువాత ఆమీర్ ఖాన్ దంగల్ మూవీ చైనా రిలీజ్‌తో ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసి రూ.2000 కోట్ల రికార్డ్ సెట్ చేసింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా పేరు ఇంకా మారుమ్రోగిపోతున్న నేపథ్యంలో కేటీఆర్ తాజాగా రామ్ చరణ్ పర్‌ఫార్మెన్స్ పై స్పందించడం.
ఆసక్తిని రేకెత్తిస్తుంది. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనకి రామ్ చరణ్ విషెష్ తెలిపారు. తిరిగి స్పందిస్తూ రాంచరణ్ ని ఉద్దేశించి కేటీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనకి బర్త్ డే విషెష్ తెలిపిన చరణ్ కి కేటీఆర్ ‘థాంక్యూ బ్రదర్’ అని రిప్లై ఇచ్చారు. ఇంకా కేటీఆర్ కామెంట్స్ చేస్తూ.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నీ పెర్ఫామెన్స్ గురించి అద్భుతమైన రివ్యూలు వింటున్నా. త్వరలోనే మూవీ చూస్తా అని కేటీఆర్ తెలిపారు. దీనితో చరణ్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఓటిటిలో సంచలనాలు సృష్టిస్తోంది. సినిమా చూశాక కేటీఆర్ ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. రాంచరణ్, కేటీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రాంచరణ్ ధృవ, వినయ విధేయ రామ చిత్రాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.