Kutami : కూట‌మికి వాలంటీర్స్ సెగ‌.. ఇది ఎవ‌రు ఊహించలేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kutami : కూట‌మికి వాలంటీర్స్ సెగ‌.. ఇది ఎవ‌రు ఊహించలేదుగా..!

Kutami : ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నో హామిలిచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే దిశగా ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎన్నికల హామీల్లో ప్రధానమైన అంశం.. వాలంటీర్లకు వేతనం పెంపు గురించి. గత ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం ఇప్పుడు లభించడం లేదు. అలాగే టీడీపీ కూటమి ఇచ్చిన రూ.10 వేల గౌరవ వేతనం కూడా రావడం లేదు. దీని వల్ల వాలంటీర్లు తీవ్రంగానే నష్టపోయారని చెప్పుకోవచ్చు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 August 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Kutami : కూట‌మికి వాలంటీర్స్ సెగ‌.. ఇది ఎవ‌రు ఊహించలేదుగా..!

Kutami : ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నో హామిలిచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే దిశగా ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎన్నికల హామీల్లో ప్రధానమైన అంశం.. వాలంటీర్లకు వేతనం పెంపు గురించి. గత ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం ఇప్పుడు లభించడం లేదు. అలాగే టీడీపీ కూటమి ఇచ్చిన రూ.10 వేల గౌరవ వేతనం కూడా రావడం లేదు. దీని వల్ల వాలంటీర్లు తీవ్రంగానే నష్టపోయారని చెప్పుకోవచ్చు. . ఇప్పటివరకు వారికిస్తున్న గౌరవ వేతనం రూ.5వేలు కూడా ఇవ్వలేదు. ప్రతినెలా పింఛన్లను వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటికీ అందజేస్తున్నారు.

Kutami వాలంటీర్ల సెగ‌..

ఇప్పటివరకు ఓపిక పట్టిన వాలంటీర్లు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారంతా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో తమకు వేతనం పెంచి ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈనెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు.

Kutami కూట‌మికి వాలంటీర్స్ సెగ‌ ఇది ఎవ‌రు ఊహించలేదుగా

Kutami : కూట‌మికి వాలంటీర్స్ సెగ‌.. ఇది ఎవ‌రు ఊహించలేదుగా..!

విజయవాడలో ఈనెల 31వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన వేతనం రూ.10వేలతోపాటు పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యవర్గ సమావేశంలో ఉద్యమానికి విధివిధానాలు రూపొందించి దానిప్రకారం ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. వాలంటీర్లు ఉద్యోగ భద్రతపై కూడా ఆందోళన చెందుతున్నారు. ఉన్న ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? అనే సందేశంలో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే ఇకపై తాత్సారం చేస్తే లాభం ఏమీ ఉండదనే నిర్ణయానికి వాలంటీర్లు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు అనుకోవచ్చు.ఈ క్రమంలోనే ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే గ్రామ, వార్డు వాలంటీర్లు ఉద్యమానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది