Nagarjuna : రోజంతా గడిపే చాన్స్ ఇచ్చాడు!.. నాగార్జునపై లహరి కామెంట్స్
Nagarjuna : బిగ్ బాస్ షో ఇంట్లో లహరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రతీ ఒక్కరితో లహరి దాదాపుగా గొడవలు పెట్టుకుంది. ఇక యాంకర్ రవి, ప్రియ, లహరి విషయం మాత్రం నెట్టింట్లో తెగ చర్చకు వచ్చింది. ఈ ఘటనతోనే లహరి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇక లహరి ఎంట్రీతోనే నాగార్జున మీదున్న ప్రేమను చాటుకుంది. వెరైటీ రోజా పువ్వును ఇచ్చి ప్రేమను తెలిపింది.
అయితే తాజాగా లహరి తన కల నెరవేరిందన్న ఆనందంలో ఉంది. నాగ చైతన్య, నాగార్జునలతో ఒకే సారి కనిపించింది లహరి. ఇలా ఇద్దరితో కలిసి ప్రయాణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని లహరి చెప్పుకొచ్చింది. కలలు నిజమవుతుంటాయి.. జనవరి 7 నా కలం నెరవేరింది. మీలాంటి అద్భుతమైన వ్యక్తులతో రోజంతా గడిపేందుకు చాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ నాగార్జున, నాగ చైతన్యలను పొగిడేసింది.

Lahari Shari With Nagarjuna And Naga Chaitanya
Nagarjuna : నాగ చైతన్య, నాగార్జునతో లహరి..
మీ వల్ల రోజంతా ఆనందంగా గడిచింది.. నాగార్జున సర్‌ని కలవడం అద్భుతంగా ఉంది. ఆయన ఇచ్చిన ఆతిథ్యం ఎంతోగొప్పగా ఉంది.. ఎంతో హంబుల్‌గా ఉంటారు అని చెప్పుకొచ్చింది.ఈ జర్నీ ఎంతో మెమోరబుల్‌గా ఉంది.. ఈ ఇద్దరినీ కలవడం ఎంతో సంతోషంగా అనిపిస్తోంది.. అని లహరి చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ ఫోటో మీద నెటిజన్లు దారుణమైన సెటైర్లు వేస్తున్నారు.