లావణ్య త్రిపాఠి కోరికల చిట్టా.. అబ్బో ఓరేంజ్‌లో ఆశలున్నాయ్!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

లావణ్య త్రిపాఠి కోరికల చిట్టా.. అబ్బో ఓరేంజ్‌లో ఆశలున్నాయ్!!

లావణ్య త్రిపాఠి .. ఒక్కొక్కరికి ఒక్కో అలవాట్లు ఉంటాయి. కొందరికి ఆటలు ఆడటం అంటే ఇష్టం.. కొందరికి విదేశీయాణాలంటే ఇష్టం.. ట్రావెలింగ్, యాక్టింగ్, రీడింగ్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా సెలెబ్రిటీల్లో అయితే ఇవి చాలా ఉంటాయి. ఒక్కరిలోనే ఇవన్నీ ఉంటాయి. అందుకే సెలెబ్రిటీలు సమయం దొరికితే బయటకు చెక్కేస్తుంటారు. కొందరు ఖాళీ సమయాల్లో ఆటలు ఆడుతుంటారు. ఇంకొందరు వెకేషన్స్‌లో భాగంగా ప్రకృతిని ఆస్వాధిస్తుంటారు. తాజాగా లావణ్య త్రిపాఠి తన కోరికల చిట్టాను […]

 Authored By uday | The Telugu News | Updated on :25 December 2020,9:35 am

లావణ్య త్రిపాఠి .. ఒక్కొక్కరికి ఒక్కో అలవాట్లు ఉంటాయి. కొందరికి ఆటలు ఆడటం అంటే ఇష్టం.. కొందరికి విదేశీయాణాలంటే ఇష్టం.. ట్రావెలింగ్, యాక్టింగ్, రీడింగ్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా సెలెబ్రిటీల్లో అయితే ఇవి చాలా ఉంటాయి. ఒక్కరిలోనే ఇవన్నీ ఉంటాయి. అందుకే సెలెబ్రిటీలు సమయం దొరికితే బయటకు చెక్కేస్తుంటారు. కొందరు ఖాళీ సమయాల్లో ఆటలు ఆడుతుంటారు. ఇంకొందరు వెకేషన్స్‌లో భాగంగా ప్రకృతిని ఆస్వాధిస్తుంటారు.

Lavanya Tripathi ABout Her Habits In Travelling

Lavanya Tripathi ABout Her Habits In Travelling

తాజాగా లావణ్య త్రిపాఠి తన కోరికల చిట్టాను విప్పింది. ప్రయాణం చేయడంలో తనకు ఉన్న ఆశల గురించి చెప్పింది. ఎగురుతూ విమానాల్లో వెళ్లడం ఇష్టమా? రోడ్ ట్రిప్ ఇష్టమా? అంటే రోడ్ ట్రిప్‌నే ఎంచుకుంది. కొండలు, పర్వతాలు ఇష్టమా? బీచ్‌లు ఇష్టమా? అంటే రెండింటికీ ఓటు వేసింది. ఫ్యాన్సీ రెస్టారెంట్‌లు ఇష్టమా? లోకల్ ఫుడ్ స్పాట్స్ ఇష్టమా? అంటే లోకల్ అని చెప్పేసింది. రిలాక్స్ అవ్వడం ఇష్టమా లేదా.. ఎక్స్‌ప్లోర్ అవుతూ దూసుకెళ్లడం ఇష్టమా? అంటే ఎక్స్‌ప్లోర్‌నే ఎంచుకుంది.

కంట్రీ సైడ్ ఇష్టమా? లేదా సిటీలే ఇష్టమా? అని అంటే.. కంట్రీ సైడ్ అని చెప్పేసింది. ఏదైనా ఓ ప్రణాళిక వేసుకోవడం ఇష్టమా? లేదా.. ఏది తోస్తే అది చేయడం ఇష్టమా? అంటే ప్లానింగ్ లేకపోవడమే ఇష్టమంటూ గో విత్ ది ఫ్లో అనే సెలెక్ట్ చేసేసుకుంది. మొత్తానికి లావణ్య త్రిపాఠికి చాన్స్ వస్తే ప్రపంచం మొత్తం చుట్టి వచ్చేలా ఉంది. లావణ్య త్రిపాఠిప్రస్తుతం ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా అనే చిత్రాల్లో నటిస్తోంది.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది