lavanya Tripathi : హీరోయిన్లకు బైక్ రైడింగ్ కష్టాలు.. లావణ్య త్రిపాఠి పిక్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 31, 2021, 7:12 pm

lavanya Tripathi : సినిమాల్లో హీరోయిన్లు ఒక్కోసారి కేవలం పాటలకు మాత్రమే పరిమితమవుతుంటారు. ఇంకొన్ని సార్లు చిన్న పాటి యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ నటిస్తుంటారు. అయితే ఈ మధ్య హీరోయిన్లు బైక్ రైడింగ్స్ కూడా చేస్తున్నారు. అయితే స్వతాహాగా బైక్ రైడింగ్ వస్తే పర్వాలేదు. కానీ ఒక వేళ హీరోయిన్లకు బైక్ రైడింగ్ రాకపోతే మాత్రం ఆమెకు, చిత్రయూనిట్ కష్టాలు తప్పవు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కి అదే పరిస్థితి ఎదురైనట్టుంది.

ప్రస్తుతం భూమిక అయితే సినిమా మొత్తం బైక్ రైడ్ చేస్తూనే కనిపిస్తోంది. ఆమధ్య శ్రద్దా శ్రీనాథ్ కూడా బైక్ రైడింగ్ చేసింది. కానీ ఆ ప్రయత్నంలోనే బైక్ మీద నుంచి కిందపడిపోయింది. ఆ వీడయో అప్పట్లో బాగానే వైరల్ అయింది. అయితే రాని వాటి కోసం ప్రయోగాలు చేసి కాళ్లు చేతులకు దెబ్బలు తగిలించుకోవడం ఎందుకని లావణ్య ఎలాంటి రిస్క్ లేకుండా చూసుకుంది. మొత్తం రోప్స్ సాయంతో బైక్ రైడ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చింది.

lavanya tripathi rides bike in a1 express set

lavanya tripathi rides bike in a1 express set

లావణ్య త్రిపాఠి పిక్స్ వైరల్.. lavanya Tripathi

లావణ్య త్రిపాఠి ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా కోసం హాకి ఆటను నేర్చుకుంది. ఆ సినిమాలోనే లావణ్య బైక్ రైడింగ్ కూడా చేయాల్సి వచ్చింది. కానీ లావణ్యకు బైక్ నడపడం రాదు. దీంతో యూనిట్ సపరేట్ ప్లాన్ రెడీ చేసింది. నాలుగు చక్రాల బండి మీద బైక్‌ను రోప్ సాయంతో కట్టేసి షూటింగ్ చేసేశారు. ఇక తెరపై మాత్రం లావణ్య త్రిపాఠి బైక్ రైడ్ చేసినట్టుగా కనిపిస్తుంటుంది. మొత్తానికి హీరోయిన్లకు కూడా ఇలాంటి సీన్లతో సవాల్ ఎదురవుతుంటుంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp