Manchu Vishnu : ప్రస్తుతం మా అసోసియేషన్ లో సొంత బిల్డింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే ఇంతవరకు సొంత బిల్డింగ్ కి పునాది రాయి పడలేదు. ఓ సందర్భంలో తాను నిర్మించడానికి రెడీగా ఉన్నా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని మంచు విష్ణు తెలిపారు. ఆ తర్వాత మా నుంచి కానీ అధ్యక్షుడి నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇంకా విష్ణు పదవి కాలం ఒక ఏడాది మాత్రమే ఉంది. ఈలోపు బిల్లింగ్ పూర్తి అవుతుందన్న నమ్మకం లేదు. ఈ విషయంలో మాలో ఏం జరుగుతుందో అర్థం కానీ సన్నివేశం కనిపిస్తుంది.
ఓప్పుడు సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది మా బిల్డింగ్ కట్టాలని అంటుంటే మరికొంతమంది బిల్డింగ్ అవసరం లేదని , ఆ డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని అంటున్నారు. బిల్డింగ్ నిర్మాణానికి కనీసం 40 కోట్లు అయినా ఖర్చు అవుతుంది. 700 మంది సభ్యులు ఉన్న మా కు 20 మంది ప్యానల్ లో ఉన్నారు. మా మీటింగ్ జరిగితే అందరూ హాజరు అయ్యే పరిస్థితి ఉండదు. అధ్యక్షుడు, అతడి టీంకి రోజు ఆఫీస్ కి వచ్చే పని ఉండదు. కేవలం ఈసీ మీటింగ్ సమావేశాల్లో తప్ప మా బిల్డింగ్ వలన ఉపయోగాలు ఏంటి అన్న వాదన వినిపిస్తోంది.
20 మంది కోసం 40 కోట్ల రూపాయలతో బిల్డింగ్ అవసరమా, ఆ డబ్బులు పేదవారి కోసం ఖర్చు చేస్తే బాగుంటుంది కదా అని మెజారిటీ వర్గం భావిస్తున్నారట. అలాగే ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ ప్లేస్ లో కొత్త బిల్డింగ్ నిర్మించే ఆలోచనలో ఉన్నారట. దానికి 40 కోట్లు ఎందుకని అంటున్నారట. ఈ క్రమంలోనే సొంత బిల్డింగ్ కి సంబంధించిన నిర్ణయం అధ్యక్షులు తీసుకోలేకపోతున్నారట. అయితే మాకీ సొంత బిల్లింగ్ కల ఎప్పటికీ నెరవేరేటట్లు లేదు. ఎప్పటినుంచో సొంత బిల్డింగ్ కట్టుకోవాలని పెద్దలు భావిస్తున్నారు. రాఘవేంద్రరావు, చిరంజీవి, మురళీమోహన్ లాంటివాళ్ళు ఎప్పటినుంచో అంటున్నారు. కానీ తాజా కమిటీ ఇప్పుడు ఆ ఆలోచన పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తుంది. మరీ మా అసోసియేషన్ సొంత బిల్డింగ్ నిర్మించుకుంటుందో లేదో చూడాలి.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.