Macherla Niyojakavargam : మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం ఫ‌స్ట్ డే కలెక్షన్స్ ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Macherla Niyojakavargam : మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం ఫ‌స్ట్ డే కలెక్షన్స్ ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 August 2022,12:40 pm

Macherla Niyojakavargam : నితిన్ హీరోగా విడుద‌లైన‌ సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల న‌డుమ వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. తొలి రోజు ఈ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వ‌చ్చింద‌నే చెప్పాలి. ఈ సినిమా తెలంగాణ (నైజాం)లో రూ. 6 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) – రూ. 3 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ -రూ. 10 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 19 కోట్లు.. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 1.20 కోట్లు.. ఓవర్సీస్ రూ. 1.20 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 21.20 కోట్లు జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 22కోట్లు రాబట్టాలి.

Macherla Niyojakavargam : తొలి రోజు వ‌సూళ్లు..

ఈవినింగ్ అండ్ నైట్ షోలలో టాక్ బాగుంటే సినిమా రెచ్చి పోయేది కానీ టాక్ మిక్సుడ్ గా ఉండటంతో ఈవినింగ్ షోలలో మాస్ సెంటర్స్ లో తప్పితే మిగిలిన చోట్ల బుకింగ్స్ యావరేజ్ గానే ఉన్నాయి, కలెక్షన్స్ పరంగా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని ట్రాక్ చేయలేం కాబట్టి అన్ని చోట్లా లెక్కలు ఆక్యుపెన్సీ బాగుంటే ఈ కలెక్షన్స్ మరికొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి.

macherla niyojakavargam first day collections

macherla niyojakavargam first day collections

ఇక సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోయే రేంజ్ లో ఉంటె 3.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు.మొత్తం మీద సినిమా కి వచ్చిన టాక్ దృశ్యా ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే రేంజ్ లో ఉంటాయో ఉండవో అన్నది మాత్రం ఓవరాల్ గా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై డిపెండ్ అయ్యి ఉంది, లాంగ్ వీకెండ్ ఉండటంతో సినిమా స్టడీ గా కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇక టోటల్ గా ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది