Madhupriya : పోలీస్ స్టేషన్‌లో సింగర్ మధుప్రియ.. మరోసారి అదే జరిగింది..!

Authored By vamana sai | The Telugu News | Updated on : 22 May 2021, 9:45 pm

Madhu priya : సింగర్ మధుప్రియ అంటే తెలియనివారెవరూ ఉండరు. తన చిన్నతనంలోనే ఆడపిల్లనమ్మా..నేను ఆడపిల్లనాని అనే పాటతో తెలంగాణా రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలలోని ప్రజల కంట నీరు పెట్టించి దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ పాట విన్న ప్రతీ ఒక్కరు ఆడపిల్ల గొప్పతనాన్ని ఇంత గొప్పగా..ఎంత ఉధ్వేగంగా పాడిందని మధుప్రియను ప్రశంసలతో ముంచేశారు. ఇదే పాటతో తెలంగాణ రాజకీయ నాయకులను కదిలించి తన సత్తా ఏంటో చూపించింది. దాంతో అప్పుడు ఎక్కడ తెలంగాణ సభలు జరిగినా ఈమెతో పాటలు పాడించేవారు.

దాంతో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మంచి పేరు ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకొని సంచలనం సృష్ఠించింది. నాటకీయ పరిణామాల మధ్య కొంత కాలం ఇంట్లో వాళ్ళకి దూరమయింది. ఈ వ్యవహారంలో పోలీసు కేసు..మీడియా ముందు వచ్చి మాట్లాడటం వంటి విషయాలతో చర్చనీయాంశంగా మారింది. తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగి కొంతకాలం సైలెంట్‌గా ఉంది. అయితే బిగ్ బాస్ సీజన్‌లో పార్టిసిపేట్ చేసి ప్రచారంలో నిలిచింది. మళ్ళీ సింగర్‌గా తన సత్తా చాటాలని అందరూ ఎంకరేజ్ చేయడంతో తెలుగు సినిమాలలో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడుతోంది.

Madhupriya

Madhupriya

Madhupriya : మధుప్రియ షీ టీమ్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది.

అంతేకాదు ఈ మధ్య మధుప్రియ బుల్లితెర మీద కూడా బాగా సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకి బ్లాంక్ కాల్స్ వచ్చాయట. దాంతో మధుప్రియ షీ టీమ్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. ఈమె ఇచ్చిన ఆధారాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 509, 354 బి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారట. ప్రస్తుతం దర్యాపు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారకులైన వారిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలునున్నాయని తెలుస్తోంది. మధుప్రియకు ఇలా బ్లాంక్ కాల్స్ చేసిన వారు నిజంగానే గుర్తు తెలియని వ్యక్తులా లేక దగ్గరి వారా అనేది త్వరలో వెల్లడి కానుంది.

Advertisement

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి