Mahesh Babu : షూటింగ్‌లో కోపోద్రిక్తుడైన మహేష్ బాబు.. కారణం చెప్పిన దర్శకుడు
Mahesh : మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మే 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మహేష్ బాబు, పరశురామ్ మధ్య విభేదాలు ఉన్నాయని సినిమా విషయంలో మహేష్ సంతృప్తిని వ్యక్తం చేయలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. పరశురామ్ సినిమాలో హీరో లేకుండా ఒక్క సీన్ ను కూడా రాసుకోలేదని ఇలా చేయడం మహేష్ కు మరింత కోపం తెప్పించిందని ప్రచారం జరిగింది. కామెంట్లకు సంబంధించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు పరశురామ్.
మహేష్ బాబు తనపై చిరాకు పడటం వాస్తవమేనని పెద్ద సినిమాలు చేసే సమయంలో కచ్చితంగా చిరాకులు ఉంటాయని పరశురామ్ చెప్పుకొచ్చారు.మూడు దశల కరోనా వలన ఒక స్క్రిప్ట్ ను మూడేళ్ల పాటు మోసాను. అంత కాలం మోయడం కష్టమైన పని అని ఆ ఒత్తిడిలో ఒకట్రెండు ఘటనలు జరిగినా మహేష్ మాత్రం తనను సోదరుడిలా చూసుకున్నాడని పరశురామ్ వెల్లడించారు. మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ లో వేలు పెట్టరని ఇద్దరి మధ్య గొడవలు వచ్చేంత గ్యాప్ మాత్రం రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి సినిమాకు ప్రాక్టికల్ గా ఇబ్బందులు కచ్చితంగా ఉంటాయని ఆయన అన్నారు.

Mahesh Babu director gives clarity
Mahesh Babu : అసలు క్లారిటీ ఇదే..
అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయాల్సిన మూవీ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తే చిరాకు వస్తుందని అయితే ఆ చిరాకుల వల్ల సినిమాకు మాత్రం ఇబ్బంది కలగలేదని ఆయన వెల్లడించారు.గీత గోవిందం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా నేను ఈ సినిమా కథ రాసుకుని మహేశ్ బాబుగారికి వినిపించాను. ఈ కథను మహేశ్ చాలా ఎంజాయ్ చేస్తూ విన్నారు. దానిని బట్టే ఆయనకి ఈ కథ నచ్చిందనే విషయం నాకు అర్థమైపోయింది. కథ చాలా బాగుందంటూ మహేశ్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. హీరోయిన్ గా ఎవరిని అనుకుంటున్నారని ఆయన అడిగితే కీర్తి సురేశ్ అని చెప్పాను. అందుకు ఆయన ఓకే అనేశారు. సర్కారు వారి పాట సినిమాకు ఒకే టైటిల్ ను అనుకున్నానని ఆ టైటిల్ నే ఫిక్స్ చేశానని పరశురామ్ అన్నారు.