Mahesh Babu : మహేష్ బాబు త్రివిక్రమ్ విషయంలో జాగ్రత్తపడాల్సిందే.. లేదంటే ఇక అంతే..?
Mahesh Babu : ఒక్క సర్కారు వారి పాట సినిమా ఫ్లాప్‌తో మహేష్ బాబు తర్వాత సినిమాల మీద గట్టిగానే ప్రభావం చూపించిందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే ఒకసారి ఆలోచించాలిందే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం వీరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలే. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాలతో వరుసగా భారీ హిట్స్ అందుకున్నారు మహేశ్. ఈ రకంగా కంటిన్యూ హిట్స్ అందుకున్న హీరోలంటే ఒక్క మహేశ్ అని చెప్పక తప్పదు. అయితే ఆ సక్సెస్‌ను సర్కారు వారి పాట సినిమా బ్రేక్ చేసింది.
ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న అంచనాలు వేరే లెవల్. అయితే, కొందరు మాత్రం పరశురామ్ ఢీల్ చేయగలడా అంటూ కామెంట్స్ కూడా చేశారు. సినిమా రిలీజయ్యాక అదే నిజమైంది. ఫస్టాఫ్ పరమ బోరింగ్ స్క్రీన్ ప్లే అని తేల్చేశారు. మహేశ్ సినిమా ఏదైనా మొదటి భాగంలో 15 నుంచి 20 నిమిషాలలోపే కథలోకి వెళ్ళిపోతుంది. కానీ, సర్కారు వారి పాట అసలు కథ సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అప్పటి వరకూ రొటీన్ లవ్ సీన్స్‌తోనే నెట్టుకొచ్చాడు దర్శకుడు. పైగా కీర్తి సురేశ్ క్యారెక్టర్ ఏంటో ముందే రిలీవ్ కావడంతో ఆ తర్వాత ఏ సీన్ వస్తున్నా ఇది ఫేక్ అని క్లియర్‌గా అర్థమయింది. ఇక్కడే సర్కారు వారి పాట సినిమా నష్టాల పాలవడానికి కారణం అయింది.
Mahesh Babu : ఆ నమ్మకం ఏమవుతుందో అని ఫ్యాన్స్‌లో కొంత కంగారు అయితే ఉంది.
మొత్తంగా దాదాపు 20 కోట్ల వరకు ఈ సినిమాకు నష్టాలు వచ్చినట్టు టాక్. ఇలాంటి సమయంలో మహేశ్ త్రివిక్రమ్ శీనివాస్‌తో సినిమా చేయడం అంటే పెద్ద సాహసమే. ఎందుకంటే గతంలో వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరిపోయాయి. అతడు అద్భుతంగా ఉన్నా ఓవర్ బడ్జెట్ వల్ల నష్టాలు తప్పలేదు. ఇక ఖలేజా బుల్లితెరపై మాత్రమే హిట్. థియేటర్స్‌లో మాత్రం ఫ్లాప్. సాధారణంగా మహేశ్ బాబు ఒకసారి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడు. దీనికి ఉదాహరణ సుకుమార్, శ్రీను వైట్ల. అయినా మూడవసారి త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇచ్చారంటే నమ్మకంతోనే. ఆ నమ్మకం ఏమవుతుందో అని ఫ్యాన్స్‌లో కొంత కంగారు అయితే ఉంది. ఇక ఈ సినిమా మహేశ్ కి హిట్టవ్వడం తప్పనిసరి.