Evaru Meelo Koteeswarulu : మహేష్ ఎన్టీఆర్ ఎపిసోడ్.. ఇంకెప్పుడురా? అంటూ ఫ్యాన్స్ ఫైర్
Evaru Meelo Koteeswarulu : మహేష్ ఎన్టీఆర్ ఎపిసోడ్.. ఇంకెప్పుడురా? అంటూ ఫ్యాన్స్ ఫైర్
ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక షో గురించి ఈ మధ్య బాగానే వినిపిస్తోంది. ఎస్సై రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు మీలో కోటీశ్వరులు హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి వాడు హోస్ట్ చేస్తున్నా కూడా షోకు రేటింగ్స్ రావడం లేదు. రేటింగ్స్ పరంగా ఈ షో దారుణంగా ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ ఎంత ప్రయత్నించినా కూడా షోను సక్సెస్ చేయలేకపోతోన్నాడు. మొత్తానికి ఈ షోకు స్పెషల్ అట్రాక్షన్ రాబోతోంది.

Mahesh Babu In NTR Evaru Meelo Koteeswarulu
ఇంత వరకు గెస్టులను తీసుకొచ్చినా లాభం లేకుండాపోయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి మొదటి ఎపిసోడ్ చేశారు. అది బాగానే వర్కవుట్ అయింది. కానీ ఆ తరువాత సమంత, దేవీ శ్రీ ప్రసాద్, తమన్ లాంటి వారిని తీసుకొచ్చినా కూడా లాభం లేకుండా పోయింది. ఈ షోకు అదనపు హంగుల కోసం ఇప్పుడు మహేష్ బాబును రంగంలోకి దించారు. మహేష్ బాబు, ఎన్టీఆర్ కలిసి ఈ షోలో కనిపించబోతోన్నారు. హాట్ సీటులో మహేష్ బాబు కనిపించబోతోన్నాడు.
Evaru Meelo Koteeswarulu : ఒకే స్క్రీన్ పై మహేష్, ఎన్టీఆర్
ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ముగిసింది. దసరా, దీపావళికి ఎపిసోడ్ ప్రసారం చేస్తారని అంతా ఊహించారు. కానీ ఇంత వరకు ఈ షోకు సంబంధించిన అప్డేట్ రాలేదు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఎపిసోడ్‌లోని ఓ స్టిల్‌ను షేర్ చేశారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్ని రోజులకు అప్డేట్ ఇచ్చావారా? ఇంకెన్ని రోజులు నీ దగ్గరే పెట్టుకుంటావ్ రా.. త్వరగా టెలికాస్ట్ చేయరా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.