Samantha : సమంత చేస్తే కరెక్ట్ కానీ మహేశ్ బాబు చేస్తే తప్పా.. హీరోయిన్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు..
Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంతపై కొందరు మళ్లీ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను తప్పుబడుతూ పలు విషయాలను ప్రస్తావిస్తున్నారు. గతంలో నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన నేపథ్యంలో సమంతనే తప్పు చేసిందని ట్రోల్ చేశారు. అయితే, ఆ కామెంట్స్‌కు సమంత కౌంటర్ కూడా ఇచ్చింది. ఆ సంగతి పక్కనబెడితే.. తాజాగా సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా’ సాంగ్‌ను ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు సమంత చేసిన పనిని తప్పుబడుతున్నారు.సమంత చేసిన ఆ స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
అయితే, ఈ సాంగ్‌లో ఉన్న లిరిక్స్ పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘మగాళ్లందరూ కామంతోనే’ ఉంటారని అర్థం వచ్చేలా ఉన్న వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆంధప్రదేశ్ పురుషుల సంఘం హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ సంగతి అలా ఉంచితే.. మహేశ్ అభిమానులు, కొందరు నెటిజన్లు సమంతను ట్రోల్ చేయడానికి గతంలో జరిగిన ఓ ఘటన కారణమవుతున్నది. అదేంటంటే..మహేశ్ నటించిన ‘1..నేనొక్కడినే’ చిత్రంలో ఓ పాటాలో కథానాయిక కృతిసనన్.. మహేశ్ బాబు, కాళ్లను ఫాలో అవుతున్నట్లు ఓ సీన్ ఉంటుంది. ఈ సీన్‌పై అప్పట్లో సమంత అభ్యంతరం వ్యక్తం చేసింది.

Mahesh Babu netizens troll on heroine samantha
Samantha : అప్పట్లో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ రచ్చ చేస్తున్న మహేశ్ అభిమానులు..
అలా అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల అప్పట్లోనే మహేశ్ అభిమానులు సమంతను ట్రోల్ చేశారు. కాగా, ఇప్పుడు ‘ఊ అంటావా’ సాంగ్‌లో సమంత.. ఒకరి గుండెపై కాలు పెట్టినట్లు సీన్ ఉంది. అప్పుడు అలా కామెంట్స్ చేసిన సమంత ఇప్పుడు ఈ పాటకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తూ సమంతను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇండియన్ సినిమాలతో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ కూడా చేయబోతున్నారు. ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.