Mahesh Babu : తారక్ తో ఆ విషయం చెబుతూ ఏమోషనల్ అయిన మహేష్ బాబు 25 లక్షలు ఆ ఛారిటీ కోసమే..!
Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తోన్న కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా విజయవంతంగా ప్రసారమైన ఈ సీజన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ అప్పియరెన్స్ తో అద్భుతమైన ఎండింగ్ ఇచ్చారు షో మేకర్స్. కొద్ది రోజుల క్రితం విడుదలైన ప్రోమోతో ఈ ఏపీసోడ్ పై ఇరువురి హీరోల అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇద్దరూ కలసి ఒక స్టేజీపై తొలిసారి కలవబోతుండటంతో వారిద్దరూ ఏం మాట్లాడుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ ఏపీసోడ్ బుల్లితెరపై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. షోలో మహేష్ 25 లక్షలు గెలుచుకోగా… ఈ ఇరువురి హీరోల మధ్య జరిగిన సంభాషణ ఆద్యంతం అలరించేలా సాగింది.గేమ్ లో భాగంగా… హోస్ట్ తారక్ అడుగుతున్న ప్రశ్నలకు మహేశ్ చక చక సమాధానాలు ఇస్తూ పోయారు.
అలాగే ఆ ప్రశ్నల మధ్య ఆయన తన జీవితానికి సంంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కుటుంబం గురించి మాట్లాడుతూ… తండ్రిగా పిల్లలతో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తానని తెలిపారు. ఇక తను ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గురించి ప్రస్తావిస్తూ…. ఈ సినిమా పోకిరిలా ఉంటుందని అన్నారు. గేమ్ అలా సాగుతూ వెళ్తుండగా తారక్ కాసేపు ఆటను ఆపేసి మహేష్ ను ఓ ప్రశ్న అడిగారు. సాధారణంగా ఏ సెలబ్రిటీ వచ్చినా ఓ ఛారిటీ కోసం ఆట ఆడుతారని… తమరు ఏ ఛారిటీ కోసం ఆడుతున్నారో తెలుసుకోవచ్చా అని అడిగారు.దీనిపై స్పందించిన మహేశ్… తాను ఎం.బీ ఫౌండేషన్ అనే ఛారిటీ ద్వారా ఇప్పటి వరకూ ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్స్ వారితో కలిసి పేదలకు వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

mahesh babu reveals his charity details in evaru milo kotishwarlu show
Mahesh Babu : సాయం చేయడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో..!
అందులో డబ్బు లేని పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు జరిపించినట్లు వివరించారు. ఆపరేషన్ సక్సెస్ అయిన అనంతరం.. ఆయా పిల్లలు తన ఫోటో చూసి నవ్వే ఓ చిరునవ్వు చూస్తే.. వారికి సాయం చేసే అదృష్టం తనకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపిస్తుందని చెబుతూ ఏమోషనల్ అయ్యారు.అలా ఈ షోలో మహేష్ మొత్తం 25 లక్షలు గెలుచుకున్నారు. ఆ మొత్తాన్ని తన ఛారిటీ తరఫున పేదల సంక్షేమం కోసం ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. ఇలా షో మొత్తం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు సూపర్ స్టార్ మహేష్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు బుల్లితెరపై సందడి చేయడం అభిమానులకు అలరించింది. మహేష్ బాబు ఇలాంటి గేమ్ షో లో పాల్గొనడం ఇదే తొలిసారి కాగా ఈ ఎపిసోడ్‌తో ఎవరు మీలో కోటీశ్వరులు సీజన్ 1 ముగిసింది.
Mahesh Babu’s initiative for children’s healthcare!
Evaru Meelo Koteeswarulu | Gemini TV#EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu pic.twitter.com/Uq1BsYKfrG— Gemini TV (@GeminiTV) December 7, 2021