Mahesh Babu : సర్కారు వారి పాట షూట్ కు బ్రేక్… హాస్పిటల్ లో మహేష్ బాబు..!
Mahesh Babu : టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. కరోనా కారణంగా కొద్ది రోజులు నిలిచిపోయిన ఈ చిత్రం… అనంతరం శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఇటీవల స్పెయిన్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు.. ఓ పాటను చిత్రీకరించిన చిత్ర బృందం… ఆ తర్వాత చివరి షెడ్యూల్ను తాజాగా హైదరాబాద్లో షిఫ్ట్ చేసింది. ఈ షెడ్యుల్ ను త్వరగా పూర్తి చేసి ఇక అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టే ఆలోచనలు ఉండగా.. అక్కడే సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.
చివరి దశకు చేరుకున్న చిత్ర షూటింగ్ ఇంకొద్ది రోజుల్లో పూర్తి అవుతుందని అనుకుంటుండగా.. ఇప్పుడు ఈ షెడ్యుల్ కు ఇంకొన్నాళ్ల పాటు బ్రేక్ రానున్నట్టు సమాచారం అందుతోంది. అందుకు కారణం హీరో మహేష్ బాబే అని తెలుస్తోంది. మహేష్ గత కొన్ని రోజులుకుగా మోకాలికి సంబంధించిన ఓ సమస్యతో బాధపడుతున్నారట. ఆ కారణంగా ఆయనకు ఓ కీలక సర్జరీ జరగాల్సి ఉందని వైద్యులు సూచించారట. ఈ కారణంగానే ఆయన షూటింగ్ కు కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే మూవీ షూటింగ్ మరికొంత ఆలస్యం అవ్వక తప్పేలా లేదు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Mahesh Babu sarkaru vaari pata movie updates
Mahesh Babu : హాస్పిటల్ కు మహేష్ బాబు:
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై… నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాను ముందుగా… సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించిన చిత్ర బృందం… షూట్ ఆలస్యం కావడంతో ఆ తర్వాత ఏప్రిల్ 1 న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు.