Mahesh Babu : మహేష్ బాబు భార్య నమ్రత గురించి వైరల్ అవుతోన్న షాకింగ్ న్యూస్..!
Mahesh Babu : మహేష్ బాబు.. నమ్రతా శిరోద్కర్ ను పెళ్లి చేసుకున్నాక ఆయన జీవితమే ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి.. తన పెళ్లికి ముందు మహేశ్ వ్యవహారాలన్నీ ఆయన అన్న చూసుకునే వారు. కానీ.. తనను అర్థం చేసుకునే భార్య దొరికింది మహేశ్ కు. నమ్రతను పెళ్లి చేసుకున్నాక ఆయన ఆర్థిక వ్యవహారాలు, సినిమా విషయాలు అన్నీ నమ్రతనే చూసుకోవడం స్టార్ట్ చేసింది. మహేశ్ సినిమాల ఎంపిక మాత్రమే కాదు.. ఆయన పారితోషికం, ఆయన బిజినెస్ వ్యవహారాల్లోనూ ఆమె పాత్ర ఉంటుంది. నిర్మాతలు మహేశ్ బాబు కంటే ముందే.. నమ్రతను కలుస్తారట.
ముందే నమ్రతతో మాట్లాడిన తర్వాత మహేశ్ దగ్గరికి వెళ్తారట.నిర్మాతలను ముందే ఇంత ఇవ్వాలని నమ్రత డిమాండ్ చేస్తుందట. అప్పుడు నిర్మాతలు తడుముకుంటే.. ప్రస్తుతం డేట్స్ ఖాళీ లేవని చెబుతుందట. మొత్తానికి మహేశ్ బాబు ఆర్థిక వ్యవహారాలన్నీ నమ్రత చూసుకోవడం.. మహేశ్ కు చాలా టెన్షన్ ను తగ్గించడమే. అంతే కాదు.. మహేశ్ బాబు సంపాదించిన డబ్బును పలు రకాలుగా బిజినెస్ లలో పెట్టుబడి పెడుతోంది నమ్రత. ఇప్పటికే ఏఎంబీ మాల్, రియల్ ఎస్టేట్ రంగంలోకి మహేశ్ బాబు దూసుకొచ్చారు.
Mahesh Babu : తాజాగా మినర్వాను ప్రారంభించిన నమ్రత
తాజాగా నమ్రతా శిరోద్కర్.. మినర్వా పేరుతో రెస్టారెంట్ ప్రారంభించింది. నమ్రత బిజినెస్ లు చేస్తే ఓకే కానీ.. మరీ.. మహేశ్ సినిమాల విషయంలో పారితోషికం విషయంలో కూడా ఆమె ఇన్వాల్వ్ అవడం ఏంటి అని అనుకుంటున్నారు. చివరకు మహేశ్ తను చేసే యాడ్స్ కూడా ఆమె చెబితేనే చేస్తారట. ఇలా.. మహేశ్ కూడా ప్రతి విషయంలో నమ్రత మీదనే డిపెండ్ అవడం ఏంటి.. ఆమె కూడా మహేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటి.. చివరకు పారితోషికం కూడా ఆమె డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ మహేశ్ అభిమానులు సోషల్ మీడియాలో చర్చ పెట్టారు. మరి.. ఇది నిజమా? అబద్ధమా? అనేది తెలియదు కానీ.. ఈ విషయం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.