Mahesh Babu : మూడేళ్ళు రాజమౌళి లాక్ చేస్తే మహేష్ బాబుకి లాభమా..నష్టమా..?
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా కోసం దాదాపు 10 ఏళ్ళుగా అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు, సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటికే గనక వచ్చి ఉంటే ఛత్రపతి, విక్రమార్కుడు లాంటి లాంటి యాక్షన్ సినిమాలొచ్చి ఉండేవి. కానీ, ఇప్పుడు అటు జక్కన్న లెక్కలు, ఇటు మహేశ్ మార్కెట్ ఊహించని విధంగా మారిపోయింది. రాజమౌళి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన మార్కెట్ ఏర్పడింది. ఆయన సినిమాను ఎంత బడ్జెట్‌తో తీసిన దానికి నాలుగురెట్లు వసూళ్ళు వస్తున్నాయి.
కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషలన్నిటిలోనూ, హిందీలోనూ ఊహించని వసూళ్ళు రాబడుతున్నాయి. బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా మార్కెట్‌ను సెట్ చేసిన జక్కన్న ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో దాన్ని ఇంకాస్త బలపడేలా చేశారు. కథ, కథనాలు బలంగా ఉండి సినిమాలో కథకు తగ్గ హీరో దొరికితే మాత్రం రాజమౌళి సృష్ఠించే రికార్డులు ఎవరూ అంచనా వేయలేరు. అదే ఇప్పుడు మహేశ్‌తో రాజమౌళి చేయబోతున్న సినిమా మీద మొదలయ్యాయి. ఇప్పటికే, రాజమౌళి తండ్రి అగ్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికా నేపథ్యంలో కథ సిద్ధం చేస్తున్నారు. రాజమౌళికి కథ విషయంలో ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. మహేశ్ కూడా దాదాపు కథకు ఒకే చెప్పేసినట్టే. అందుకే ఇటీవల రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు.
Mahesh Babu : పాన్ ఇండియా క్రేజ్, భారీ రెమ్యునరేషన్ దక్కుతాయి.
దాదాపు ఈ మూవీకి సంబంధించిన వీఎఫెక్స్ వర్క్ ఎక్కడ చేయబోతున్నారో క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఏకంగా మూడేళ్ళు లాకవబోతున్నాడు. అదే రాజమౌళి మహేశ్ వద్ద తీసుకున్న కమిట్‌మెంట్. ఆ మూడేళ్ళలో సినిమా కంప్లీట్ కాకపోయినా మహేశ్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. అయితే, మహేశ్ ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా లాభాలలో వాటా కలిపి దాదాపు 75 నుంచి 80 కోట్ల వరకు అందుకున్నట్టు టాక్. ఈ లెక్కన రాజమౌళి సినిమా కోసం మూడేళ్ళు డేట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా 150 కోట్ల వరకైనా రెమ్యునరేషన్ ఉంటుంది. దీనికంటే తగ్గితే మహేశ్ ఈ సినిమా చేసి రెమ్యునరేషన్ పరంగా ఉపయోగపడేదేమీ ఉండదు. అలా కాకుండా సినిమా లాభాలలో వాటా దక్కితే మాత్రం పాన్ ఇండియా క్రేజ్, భారీ రెమ్యునరేషన్ దక్కుతాయి.