Maheswari : నాకు పొగ‌రు అనేవారు… ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో స్టన్నింగ్ కామెంట్స్ చేసిన మ‌హేశ్వ‌రి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maheswari : నాకు పొగ‌రు అనేవారు… ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో స్టన్నింగ్ కామెంట్స్ చేసిన మ‌హేశ్వ‌రి

 Authored By sandeep | The Telugu News | Updated on :19 January 2022,7:40 am

Maheswari : ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుకి గిలిగింత‌లు పెట్టిన అందాల ముద్దుగుమ్మ మ‌హేశ్వ‌రి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మహేశ్వరి.. ఆ తర్వాత నీకోసం, మా బాలాజీ, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ మొదలగు హిట్ చిత్రాలలో నటించింది. తన కెరీర్‌లో పీక్‌లో ఉన్నప్పుడు మహేశ్వరి సినిమా పరిశ్రమను విడిచిపెట్టింది. 2008లో తిరుపతిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన జయకృష్ణను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత పలు సీరియల్స్ నటించి మెప్పించింది మహేశ్వరి.

రీసెంట్‌గా సుధీర్ హోస్ట్ గా చేస్తోన్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి తాజాగా హీరోయిన్ మహేశ్వరి అతిధిగా విచ్చేసి సందడి చేశారు. అయితే షోలో భాగంగా ఆమెను ఆహ్వానిస్తూ సుధీర్‌ ఆమెతో చెయ్యి కలిపే ప్రయత్నం చేశాడు. ‘హాయ్‌’కి బదులు ఆమె తెలివిగా నమస్కారం చేశారు మహేశ్వరి.. ”ఇదేంటి నేను హాయ్‌ చెప్తే మీరు నమస్కారం పెడుతున్నారు?” అని సుధీర్‌ ప్రశ్నించగా ‘వద్దు బాబూ..! నేను చెయ్యి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావ్‌’ అంటూ మహేశ్వరి పంచ్‌తో నవ్వులు పూయించారు. ఇక తాజాగా ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో సంద‌డి చేసింది.

maheshwari comments on sridevi

maheshwari comments on sridevi

Maheswari : శ్రీదేవి లేర‌ని న‌మ్మ‌లేక‌పోతున్నాను..

అందాల నటి శ్రీదేవికి మహేశ్వరి బంధువు. అప్పట్లో మహేశ్వరిని అందరూ శ్రీదేవి చెల్లెలు (పిన్ని కూతురు) అనుకునేవారు. శ్రీదేవి తనకు అక్క కాదని, ఆమె తనకు పిన్ని అవుతుందని వెల్లడించింది. అయితే తాను ఆమెను అక్కా అని పిలిచేదాన్నని చెప్పింది. కానీ శ్రీదేవి ఇప్పుడు లేదంటే నమ్మబుద్ధి కావడంలేదని పేర్కొంది. ప్రస్తుతం శ్రీదేవి లేరన్నది నమ్మబుద్ధికావడంలేదని అంది. ఇక హీరో వడ్డే నవీన్ గురించి మాట్లాడుతూ.. తనతో రెండు సినిమాలు చేశానని, సెట్ లో నవీన్ పెద్దగా మాట్లాడరని,తాను కూడా సైలెంట్ గా ఉండేదానిని అని ఇద్దరి మధ్య గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ తప్ప మరో మాట ఉండేది కాదని తెలిపింది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది