sudigali sudheer : నాకు దూరంగా ఉండు.. సుధీర్ పరువుతీసిన హీరోయిన్
బుల్లితెరపై ప్రసారమౌతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సుధీర్ వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. జబర్దస్త్ తరహాలో ఈ కార్యక్రమం కూడా ప్రసారం అవుతూ జబర్దస్త్ కమెడియన్స్ ఈ కార్యక్రమంలో తమదైన శైలిలో స్కిట్లు చేస్తూ ప్రతివారం ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్నది. ఇకపోతే వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. కొత్త సంవత్సరం కావడంతో ఈ కార్యక్రమాన్ని ఈ సారి భూలోకంలో కాకుండా స్వర్గంలో చేసినట్లు సుధీర్ వెల్లడించారు.
ఈ క్రమంలోనే స్వర్గం తరహాలో సెట్ వేసి కమెడియన్స్ తమదైన శైలిలో తమ కామెడీ పంచులు ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తరచూ ఇంద్రజ జడ్జిగా వ్యవహరించడం మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి అతిథిగా సీనియర్ హీరోయిన్ మహేశ్వరి అతిథిగా పాల్గొన్నారు. ఇక మహేశ్వరికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన సుధీర్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. అయితే మహేశ్వరి మాత్రం తనకు రెండు చేతులతో నమస్కారం పెడుతుంది.

heroine maheshwari comment on sudigali sudheer in sridevi drama company
sudigali sudheer : నీతో చేయి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావు..
అదేంటి మేడమ్ నమస్కారం పెడుతున్నారు అంటూ సుధీర్ అడగగా నీతో చేయి కలిపితే నువ్వు ఏ పులిహోర కలుపుతావు అంటూ తనపై పంచ్ వేస్తుంది. వెంటనే సుధీర్ స్వర్గంలో కూడా అంటూ ఉండగా వెంటనే రాఘవ అంత మంచి పేరు సంపాదించుకున్నావన్నమాట అంటూ మరోసారి తన పరువు తీస్తాడు. ఆ తర్వాత సుధీర్ మాట్లాడుతూ మేడమ్ ఇంతకీ నన్ను ఎక్కడ ఉండమంటారని అడగగా వెంటనే మహేశ్వరి నాకు మాత్రం దూరంగా ఉండు అంటూ సుదీర్ పరువు మొత్తం తీసేసింది.
