Karthika Deepam Nirupam : మేం ఇద్దరం కలిసి అందుకే నటించం.. నిరుపమ్ భార్య మంజుల కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam Nirupam : మేం ఇద్దరం కలిసి అందుకే నటించం.. నిరుపమ్ భార్య మంజుల కామెంట్స్

 Authored By prabhas | The Telugu News | Updated on :9 June 2022,5:00 pm

బుల్లితెరపై మంజుల, నిరుపమ్‌ది హిట్ జోడి. చంద్రముఖి సీరియల్‌తోనే వీరి పరిచయం, ప్రయాణం మొదలైంది. ఆ సీరియల్ టైంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ కూడా పుట్టింది. ఆ ప్రేమ ప్రయాణం కాస్త పెళ్లి వరకు వెళ్లింది.కానీ సెట్‌లో ఎవ్వరికీ తెలియకుండా మ్యానేజ్ చేశారట. వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడంతో సెట్‌లో అందరూ షాక్ అయ్యారట. అలా ఎంతో సీక్రెట్‌గా ఇద్దరూ ప్రేమించుకున్నారట. ఇక ఫోన్ బిల్లుల మోత మోగిపోయేవట. అప్పుట్లో ల్యాండ్ లైన్స్ మాత్రమే ఉండేవన్న సంగతి తెలిసిందే. మొత్తానికి మంజుల, నిరుపమ్ మాత్రం ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత మంజులకు ఆఫర్లు కాస్త తగ్గాయి. నిరుపమ్ క్రేజ్ మాత్రం పెరుగుతూ వచ్చింది.

బుల్లితెరపై స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్నాడు. బుల్లితెర శోభన్ బాబు అంటూ కార్తీక దీపం సీరియల్‌తో నిరుపమ్ డిమాండ్ ఫుల్లుగా పెరిగింది. ఇక ఇప్పుడు నిరుపమ్, మంజుల ఇద్దరూ కూడా యూట్యూబ్ ద్వారా మరింత దగ్గరువుతున్నారు. అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఓ వీడియోను వదిలారు. అందులో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఎక్కువ మంది కొన్ని ప్రశ్నలను రిపిటెడ్‌గా అడిగారట. అందులో తామిద్దరం కలిసి ఎప్పుడు నటిస్తామని, కలిసి సీరియల్ ఎప్పుడు చేస్తామని అడుగుతున్నారట. అయితే దీనికి నిరుపమ్ ఏదో చెప్పబోయాడు.

Majula Paritala Open COmments On Acting With Karthika Deepam Nirupam

Majula Paritala Open COmments On Acting With Karthika Deepam Nirupam

మంజుల మాత్రం బీ ప్రాక్టికల్.. నేను ఇలా చెబుతున్నాను అని ఎవ్వరూ ఏమనుకోవద్దంటూ తన వర్షన్ చెప్పుకొచ్చింది. తన వయసు ఇప్పుడు 36 అంటూ.. ఈ వయసులో నాకు హీరోయిన్ పాత్రలు ఇవ్వరు.. అలా అని నిరుపమ్ ఇప్పుడు వేరే పాత్రలు చేయలేడు.. కేవలం హీరోగానే చేస్తాడు.. అందుకే మేం ఇద్దరం కలిసి నటించలేం.. అది నాకు తెలుసు.. కాకపోతే నాకు ఏవో చిన్న పాత్రలు వస్తే చేస్తాను.. అని మంజుల చెప్పేసింది. అయితే సీరియల్స్‌లో అది కుదరకపోయినా.. బయట వేరే ఏదైనా,వెబ్ సిరీస్ అయినా మేం చేస్తాం.. మాకు కథ నచ్చితే కలిసి నటిస్తామని నిరుపమ్ అన్నాడు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది