Mana Shankara Vara Prasad Garu Box Office Collections : ‘మన శంకర వరప్రసాద్ గారు’వసూళ్లు ఎంత వస్తే సేఫ్ అవుతాడో తెలుసా ?
ప్రధానాంశాలు:
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : ‘మన శంకర వరప్రసాద్ గారు’వసూళ్లు ఎంత వస్తే సేఫ్ అవుతాడో తెలుసా ?
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు‘ (MSVPG) చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి తన వింటేజ్ ఎనర్జీతో అలరించగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార ఆయనకు జోడీగా నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో విక్టరీ వెంకటేష్ కేమియో రోల్ సినిమాకు పెద్ద అసెట్‌గా మారింది.
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : ‘మన శంకర వరప్రసాద్ గారు’వసూళ్లు ఎంత వస్తే సేఫ్ అవుతాడో తెలుసా ?
Mana Shankara Vara Prasad Garu Box Office Collections ‘మన శంకర వరప్రసాద్ గారు’హిట్ టాక్ వచ్చినప్పటికీ , ఆ మేర వసూళ్లు వస్తేనే హిట్ !!సినిమాకు సంబంధించి విడుదలైన ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. చిరంజీవి కామెడీ టైమింగ్, గ్రేస్‌ఫుల్ డాన్స్ స్టెప్పులు అభిమానులకు కనువిందు చేస్తుండగా, వెంకటేష్ ఎంట్రీ తర్వాత వచ్చే సీన్లు థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశం కావడంతో మహిళా ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతోంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, యూఎస్ మార్కెట్‌లో ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉండి విదేశాల్లో కూడా మెగా పవర్ చూపిస్తోంది.
Mana Shankara Vara Prasad Garu Box Office Collections ‘మన శంకర వరప్రసాద్ గారు’ టార్గెట్ ఎంతో తెలుసా ?
ట్రేడ్ గణాంకాల పరంగా చూస్తే, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 105 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల హక్కులు కలిపి దాదాపు రూ. 140 కోట్ల మేర వ్యాపారం జరిగింది. సినిమా పూర్తిస్థాయిలో లాభాల్లోకి రావాలంటే (బ్రేక్ ఈవెన్) దాదాపు రూ. 280 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ మరియు ప్రీమియర్ల ద్వారా రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు సమాచారం. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పాజిటివ్ టాక్ ఇలాగే కొనసాగితే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.