Manchu Mohan Babu : కొడుకు మంచు మనోజ్ పెళ్లి జరిగిన 24 గంటల్లో మోహన్ బాబు బిగ్ నిర్ణయం !

 Authored By prabhas | The Telugu News | Updated on :5 March 2023,12:20 pm

Manchu Mohan Babu : మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మొదట ప్రణతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళకి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నాడు. ఇక సినిమాల పరంగా కూడా సక్సెస్ లేక మనోజ్ ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే భూమా మౌనిక రెడ్డి తో పరిచయం ఏర్పడింది .అది కాస్త ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్ళింది. భూమా మౌనిక పొలిటికల్ ఫ్యామిలీకి చెందినది. దివంగత నేత భూమా నాగిరెడ్డి శోభా రెడ్డి దంపతుల కుమార్తె ఈ భూమా మౌనిక రెడ్డి. ఈమె అక్క అఖిల ప్రియ కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

Manchu Mohan Babu big decision about Manchu Manoj

Manchu Mohan Babu big decision about Manchu Manoj

ప్రస్తుతం వీరు టిడిపి పార్టీలో ఉన్నారు. అయితే ఇటీవల మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇక మనోజ్ మౌనిక రెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. అయితే వీరి పెళ్లికి మోహన్ బాబు రావడం లేదని పుకార్లు బయటికి వచ్చాయి. వీరి పెళ్లి ఇష్టం లేని మోహన్ బాబు, విష్ణు మనోజ్ పెళ్లికి రావడం లేదని వార్తలు వినిపించాయి. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో ఆ వార్తలకు చెక్ పడినట్లు అయింది. అయితే మొదటగా అన్ని ఫోటోలలో అక్క మంచు లక్ష్మి ప్రసన్న మాత్రమే కనిపించింది.

Manchu Manoj ties Knot With Bhuma Naga Mounika With Mohan Babu Blessings  See Pics | Mohan Babu At Manoj Wedding : మోహన్ బాబు ఆశీసులతో మనోజ్ - మౌనిక  పెళ్లి, పుకార్లకు చెక్ పెట్టిన మంచు ...

ఎక్కడ మంచు మోహన్ బాబు ఆయన సతీమణి కనిపించలేదు. అలాగే మంచు విష్ణు ఆయన సతీమణి కూడా కనబడకపోవడంతో అందరూ ఆ పుకార్లు నిజమే అనుకున్నారు. కానీ పెళ్లయిన మరుసటి రోజు మంచు మోహన్ బాబు ఫోటోలు బయటకి వచ్చాయి. ముందు రోజు విడుదల చేసిన ఫోటోలలో కనిపించని మోహన్ బాబు తర్వాత రోజు ఫోటోల్లో కనిపించారు. తన సతీమణి నిర్మల తో కలిసి పెళ్లి మండపం ఎక్కారు. కొత్తజంటను ఆశీర్వదించారు. మోహన్ బాబుని పట్టుకొని మౌనిక ఎమోషనల్ అయిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. అలాగే మంచి విష్ణు భార్య పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి