Manchu Mohan Babu : ‘మంచు’ గొడవలు.. వేడిలో చలి.. చలిలో వేడి ఏది నిజం.. ఏది అబద్ధం..?
ప్రధానాంశాలు:
Manchu Mohan Babu : 'మంచు' గొడవలు.. వేడిలో చలి.. చలిలో వేడి ఏది నిజం.. ఏది అబద్ధం..?
Manchu Mohan Babu : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబు ప్రస్థానం తెలిసిందే. ఆయన నటించిన నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందించాయి. ఐతే మంచు ఫ్యామిలీలో ఈమధ్య గొడవలు బాగా జరుగుతున్నాయని తెలుస్తుంది. లేటేస్ట్ గా మంచు మోహన్ బాబు తన మీద గొడవ పడ్డాడని.. కొట్టాడని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అదే స్టేషన్ లో మోహన్ బాబు కూడా మంచు మనోజ్ తనను కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి. ఐతే ఈ గొడవలపై వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మోహన్ బాబు పి.ఆర్ టీం ఇవన్నీ ఫేక్ వార్తలని వెల్లడించారు. ఐతే మంచు గొడవలు అదే మంచు ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు కొత్తేమి కాదు. అసలు నిప్పు లేనిది పొగ రాదు అన్న సామెత ప్రకారం.. ఇలా ఒక టాక్ వచ్చింది అంటే ఏదో జరుగుతున్నట్టే లెక్క.
Manchu Mohan Babu పర్సనల్, ప్రొఫెషన్ల్ రెండిటిలో..
మోహన్ బాబు తోనే ఉంటూ మంచు విష్ణు ఆయన మాట కాదనకుండా ఉంటాడు. కానీ మనోజ్ అలా కాదు పర్సనల్, ప్రొఫెషన్ల్ రెండిటిలో అంతా డిస్టబెన్స్. అంతేకాదు విష్ణు, మనోజ్ ల మధ్య దూరం కూడా నిజమే అని తెలుస్తుంది. ఐతే శ్రీవిద్య స్కూల్ కి సంబందించిన గొడవల్లో మనోజ్ తలదూర్చడంపై మోహన్ బాబు సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. అంతేకాదు మనోజ్ చేసే పనులు ఏవి మోహన్ బాబుకి నచ్చట్లేదని అందుకే అతన్ని దూరం పెట్టారని చెబుతున్నారు.
ఐతే లేటెస్ట్ గా వారి మధ్య కొట్టుకునేంత గొడవలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కొట్టుకోవడం.. గొడవ పడటం.. ఇలాంటివి నిజమా అబధమా అన్నది తెలియాలంటే అఫీషియల్ గా ఎవరైనా ఒకరు చెప్పాలి అప్పటివరకు అవి ఫేక్ వార్తలు అన్నట్టే లెక్క. మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వీరిలో ఎవరైనా బయట సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలపై స్పందించాల్సి ఉంటుంది. ఐతే ఈ ముగ్గురి మధ్య మంచు లక్ష్మి సంధి కుదుర్చే ప్లాన్ చేస్తుంది. manchu mohan babu What Happend in their Family , Manchu Mohan Babu, Manchu Vishnu, Manchu Manoj, Manchu Family Fight, Tollywood