Manchu Vishnu : కన్నప్ప హార్డ్ డిస్క్ మనోజ్ దగ్గరే ఉంది.. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానన్న విష్ణు..!
ప్రధానాంశాలు:
Manchu Vishnu : కన్నప్ప హార్డ్ డిస్క్ మనోజ్ దగ్గరే ఉంది.. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానన్న విష్ణు..!
Manchu Vishnu : మంచు విష్ణు Manchu Vishnu హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ Kannappa Movie మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన హార్డ్ డ్రైవ్ మిస్ అయిందనే వార్త గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో, తన తమ్ముడు మనోజ్ మనుషులే ఈ పని చేశారని విష్ణు సందేహిస్తున్నారు.

కన్నప్ప హార్డ్ డిస్క్ మనోజ్ దగ్గరే ఉంది.. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానన్న విష్ణు..!
Manchu Vishnu : అక్కడే ఉంది..
అయితే మంచు మనోజ్ ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో.. కన్నప్ప హార్డ్ డ్రైవ్ కు సంబంధించిన ప్రశ్న అడగ్గా.. “మీకే ఇచ్చాను కదా ఎక్కడుంది?” అని మనోజ్ ఎదురు ప్రశ్నిస్తూ పెద్దగా నవ్వేశారు. ఒకప్పుడు సరదాగా ఏదో మాట్లాడాను కానీ, బర్త్ డే తర్వాత అలాంటివి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని అన్నారు. హార్డ్ డిస్క్ విషయంలో మాత్రం తాను జవాబు చెప్పనన్నారు.
ఇక మరోసారి విష్ణు.. కన్నప్ప హార్డ్ డ్రైవ్ విషయంలో స్పందించారు. అది మనోజ్ దగ్గర ఉన్న మనుషుల దగ్గరే ఉంది. అది మధ్యవర్తిత్వం వహించే వారితో చెప్పించాం. అయిన కూడా మా దగ్గరకు రాలేదు. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. అయితే అది బయటపెట్టకపోతే ఏం కాదు, రిలీజ్ వరకు అది బయటకు రాకపోతేనే మంచిది అని విష్ణు అన్నారు.