Manchu Vishnu : ప్రభాస్ కీ మంచు విష్ణు కి గొడవ పెట్టడానికి ట్రై చేసి అట్టర్ ఫ్లాప్ అయింది ఎవరు ?
Manchu Vishnu : టాలీవుడ్‌లో కొందరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ముఖ్యంగా మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీకి అస్సలు పడట్లేదు. మంచు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తుండగా, వాటిని నాగబాబు తిప్పి కొడుతూనే ఉన్నాడు. అయితే మంచు ఫ్యామిలీకి సంబంధించి ఇటీవలి కాలంలో దారుణమైన ట్రోలింగ్ నడుస్తుంది. ఆదిపురుష్ గురించి తాను ఏదో ఊహించుకున్నానని, కానీ టీజర్ తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని విష్ణు అన్నట్టు వార్తలు వచ్చాయి. ‘ఆదిపురుష్ చిత్ర బృందం, ప్రభాస్ ప్రేక్షకులను మోసం చేసినట్టుగా భావిస్తున్నా. ఇలాంటి చిత్రాన్ని తీసుకొస్తున్నప్పుడు ప్రేక్షకులను సంతృప్తి పరిచేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి.
ఆదిపురుష్ టీజర్లో విజువల్స్ కార్టూన్ల మాదిరిగా ఉన్నాయి. సరిగ్గా సన్నద్ధం అవకుండా ప్రేక్షకులను మోసం చేస్తే ఇలాంటి స్పందనే వస్తుంది’ అని మంచు విష్ణు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఆదిపురుష్ టీజర్, విష్ణు ఫొటోలతో కూడిన పోస్టర్ వైరల్ అవుతుండగా, ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనని ఏకి పారేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు వివరణ ఇచ్చారు. చిత్రం టీజర్ గురించి తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు. తన తదుపరి చిత్రం ‘జిన్నా’ రిలీజ్ కు ముందు ఊహించినట్టే తప్పుడు వార్తలను సృష్టిస్తారని ట్వీట్ చేశారు.

manchu vishnu gives clarity about rumors
Manchu Vishnu : అన్నీ పుకార్లే..
తన తదుపరి చిత్రం ‘జిన్నా’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు విష్ణు ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన విష్ణు.. ‘ఇది ఫేక్ న్యూస్. ఊహించినట్లుగానే, జిన్నా విడుదలకు ముందు కొంత మంది ఐటెమ్ రాజాలు ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నా డార్లింగ్ బ్రదర్ ప్రభాస్‌కి బెస్ట్ తప్ప మరేమీ అక్కర్లేదు’ అని విష్ణు ట్వీట్ చేశారు. అలాగే, ‘మా’ సభ్యత్వం కోరే హీరో/ హీరోయిన్ కనీసం రెండు చిత్రాల్లో నటించి అవి థియేటర్ లేదా ఓటీటీలో విడుదల కావాలని తాను ప్రకటించినట్టు వస్తున్న వార్త కూడా కావాలని సృష్టించినదే అన్నారు. మొత్తానికి మంచు విష్ణు క్లారిటీతో అందరిలో ఉన్న అనుమానాలకి పులిస్టాప్ పడింది.