manchu vishnu : హైద్రాబాద్‌లో మరో ఇళ్లు కడుతున్నా.. మంచు విష్ణు కామెంట్స్

Authored By Cinema Desk | The Telugu News | Published on: March 14, 2021, 10:18 am

manchu vishnu : మంచు వారికి హైద్రాబాద్‌లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. హైద్రాబాద్‌లో మంచు లక్ష్మీకి సపరేట్ ఇళ్లు ఒకటి ఉంది. అది ఆమె ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మోహన్ బాబుకు సపరేట్ ఇళ్లు ఒకటి ఉంది. శంషాబాద్ ఏరియాలో ఓ ఫాం హౌస్ ఉంది. అంతే కాకుండా అదే ఏరియాలో సిటీ వాతావరణానికి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అక్కడే ఓ ఇళ్లు కట్టుకున్నాడట మంచు విష్ణు. అయితే ఇప్పుడు హైద్రాబాద్‌లో ఓ ఇళ్లు కట్టుకుంటున్నాని చెప్పుకొచ్చాడు.

manchu vishnu planning new house hyderabad

manchu vishnu planning new house hyderabad

తనకు ఉమ్మడి కుటుంబాలు అంటే ఇష్టమని, అంతా కలిసి ఉంటేనే బాగుంటుందని అన్నాడు. అయితే నాల్గో సంతానం కలిగినప్పుడు నాన్న గారు అంత దూరంగా ఎందుకు ఉంటావ్.. ఇక్కడికే రా అని హైద్రాబాద్‌లోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. శంషాబాద్ నుంచి రావడం వెళ్లడానికే రెండు మూడు గంటల సమయం పడుతోందనే వారు. అందుకే ఇక్కడే ఓ ఇళ్లు కట్టుకుంటున్నాను. దాంట్లో నా ఫ్యామిలీ, అమ్మనాన్న అందరం ఉంటామని అన్నాడు.

manchu vishnu : హైద్రాబాద్‌లో మరో ఇళ్లు కడుతున్నా.. మంచు విష్ణు

మోసగాళ్లు సినిమాకు డబ్బులు వస్తాయ్.. దాంతో కట్టేస్తాను అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఇప్పుడు విష్ణు తమకంటూ ఓ విలాసవంతమైన భవనాన్ని కట్టేసుకుంటున్నాడు. అయితే ఏ ఏరియా, ఎంత ఖర్చు అవుతోందనే విషయాలను మాత్రం వెళ్లడించలేదు. మొత్తానికి మోసగాళ్లు సినిమాపై మాత్రం మంచి ఆశలే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఆ సినిమా ద్వారా వచ్చే లాభాలతో ఈ ఇంటిని పూర్తి చేసేస్తాననే ఉద్దేశ్యంలోనే ఆ నమ్మకం కనిపిస్తోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp