Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!
ప్రధానాంశాలు:
Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు కదా అలా ఎలా అనుకుంటున్నాడు అనుకోవచ్చు. ముందు సైడ్ రోల్స్ ఆ తర్వాత కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు ఆ నెక్స్ట్ హీరో ఫ్రెండ్ ఇలా కెరీర్ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చ్చిన రవితేజ సినిమా కోసం ఎలాంటి పని అయినా చేయడానికి రెడీ అనేస్తాడు. ఆయన ఇదివరకు కూడా అన్నాడు ఐతే రవితేజ విలన్ గా చేస్తారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఎందుకు చేయనని అన్నారు. అంటే రవితేజ కూడా విలన్ పాత్రలు చేసేందుకు సిద్ధం అన్నమాట. మాస్ రాజా ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ న్యూసే కానీ రవితేజ విలన్ గా అది కూడా స్పెసిఫిక్ రోల్ తనకు నచ్చితే చేసేందుకు సిద్ధమే అనేస్తున్నాడు. హీరోగా రవితేజ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఫలితాలు ఇవ్వట్లేదు. ఆ కారణంతోనే ఆయన విలన్ గా మారాలని అనుకుంటున్నాడు.
Raviteja విలన్ గా మాస్ రాజా మెప్పిస్తాడా..
రవితేజ విలన్ గా అంటే కచ్చితంగా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈమధ్య వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తమ్ముడి పాత్రలో రవితేజ నటించాడు. విలన్ గా రవితేజ కూడా అదరగొట్టే ఛాన్స్ ఉంటుంది. కచ్చితంగా రవితేజ విలనిజం ఫ్యాన్స్ ని అలరించే అవకాశం ఉంది.

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!
రవితేజ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల ఫలితాలను బట్టి ఆయన విలన్ గా కొనసాగించే అవకాశాల గురించి ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. రవితేజ మాస్ రాజా విలనిజం కచ్చితంగా సినీ లవర్స్ కూడా ఫీస్ట్ అందిస్తుందని చెప్పొచ్చు. రవితేజ ప్లానింగ్ ఎలా ఉందో కానీ ఆయన విలన్ గా చేసే సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.