Chiranjeevi : చిరంజీవి పుట్టిన రోజు వేడుకల కోసం అంత ఖర్చు చేస్తున్నారా?
Chiranjeevi : తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. చిరంజీవి పుట్టిన రోజును ఒక పండుగ మాదిరిగా నిర్వహించుకోవాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా మెగా ఫ్యాన్స్ కి మెగా ఫ్యామిలీ నుండి స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లాయి. ముఖ్యంగా నాగబాబు దగ్గర ఉండి చిరంజీవి యొక్క పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే ఆయన మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడటంతో పాటు ప్రతి ఒక్కరు కూడా మెగా సంబరంలో పాలు పంచుకోవాలంటూ విజ్ఞప్తి చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి గత రెండు సంవత్సరాలుగా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. కరోనా మరియు ఇతర కారణాల వల్ల భారీ ఎత్తున వేడుకలు.. వేదికలు ఏర్పాటు చేయవద్దని మెగా ఫ్యాన్స్ కు సందేశాలు వెళ్లాయి. కాని ఈసారి మాత్రం రచ్చ రచ్చ అన్నట్లుగా మెగా వేడుకలు ఉండాల్సిందే అన్నట్లుగా అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల నుండే చిరంజీవి యొక్క పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల రక్తదాన శిభిరాలు మరియు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు పర్యవేక్షిస్తున్నారు.
టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు గాను దాదాపుగా అయిదు కోట్ల వరకు ఖర్చు అవుతూ ఉంటుందని.. అదంతా కూడా స్థానిక ఫ్యాన్స్ యొక్క ఖర్చు అన్నట్లుగా తెలుస్తోంది. అభిమాన సంఘం పేరుతో సేవా కార్యక్రమాలు కూడా చేయడం ఇందులో చెప్పుకోదగ్గ విషయం. మొత్తానికి మెగా పండుగ కాస్త ఎక్కువ ఖరీదే అయినా కూడా అభిమానులు ఆనందించే విధంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.