Actress Mehreen : ఆ స్టార్ హీరో వల్లే మెహ్రీన్ పెళ్లి ఆగిపోయిందా ..??
Actress Mehreen : పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ టాలీవుడ్ లోకి నాచురల్ స్టార్ నాని నటించిన ‘ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ‘ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ మహానుభావుడు ‘ సినిమాతో హిట్టు కొట్టింది. ఆ తర్వాత రవితేజతో ‘ రాజా ది గ్రేట్ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి విజయాలను […]
Actress Mehreen : పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ టాలీవుడ్ లోకి నాచురల్ స్టార్ నాని నటించిన ‘ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ‘ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ మహానుభావుడు ‘ సినిమాతో హిట్టు కొట్టింది. ఆ తర్వాత రవితేజతో ‘ రాజా ది గ్రేట్ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి విజయాలను అందించాయి. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్నాయి. దీంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గినట్లుగా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఏ సినిమాలో నటించడం లేదని తెలుస్తుంది. అయితే సినిమాల కోసం మెహ్రీన్ ఫ్యామిలీ తన సొంత ఊరు పంజాబ్ ను వదిలేసి ముంబైకి వచ్చేసారు అయితే ఈ బ్యూటీ కి అవకాశాలు తగ్గడంతో మళ్ళీ తిరిగి పంజాబ్ కి వెళ్ళిపోయారు. ఇక పంజాబ్లో హీరోయిన్గా డిఎస్పి, దేవ్ సినిమాలు చేస్తున్న సమయంలో ఆ సినిమాకి ఫైనాన్షియల్ గా చేస్తున్న భవ్యబీష్ణు నోయల్ తో మెహ్రిన్ కి మంచి పరిచయం ఏర్పడింది. ఇక భవ్య రాజ్ రిచ్ ఫ్యామిలీ కి చెందిన వ్యక్తి. అలాగే ఆస్తిపాస్తులు కూడా ఎక్కువగా ఉండడంతో మెహరీన్ కూడా భవ్య రాజ్ ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిందట.
ఇక వీరి ఎంగేజ్మెంట్ 2021లో జరిగింది. పెళ్లి చేసుకుంటారు అనుకునే సమయంలో లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటానని భవ్యబీష్ణుకు మెహ్రీన్ చెప్పింది కానీ పెళ్లి వాయిదా పడడంతో ధనుష్ సినిమాలో ఆఫర్ రావడంతో భవ్య భిష్ణువ్ కు తెలియకుండా చెన్నై వచ్చి సినిమా కోసం ఫోటోషూట్ చేసిందట. ఈ విషయం తెలుసుకున్న అతను మెహరీన్ తో గొడవ పడడంతో ఆ సినిమా నుంచి తప్పుకుందట. ఆ తర్వాత ప్రతి విషయంలో అతను మెహ్రిన్ ను అనుమానించడంతో పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటుందో అని భావించిన మెహ్రీన్ అతడితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.