Intinti Gruhalakshmi 14 June Today Episode : మాల్ కు వెళ్లిన తులసికి అవమానం.. ప్రేమ్, శృతి కూడా అదే మాల్ కు. లాస్య వల్ల తులసికి మరో సమస్య
Intinti Gruhalakshmi 14 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 658 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ అందరికీ నా మీద పీకల వరకు ప్రేమ. అందుకే నా మీద ఎంత కోపం ఉన్నా దిగమింగుకుంటారు కానీ.. ఒక్క మాట నన్ను ఎదిరించరు.. కోప్పడరు అని తన కుటుంబ సభ్యులతో అంటుంది తులసి. ఒక్కటి గుర్తుపెట్టుకో తులసి. నువ్వు లేకపోతే మేము లేము అని అంటాడు పరందామయ్య. ఎప్పుడూ మాకే ఎంతో ధైర్యం చెప్పేదానికి.. ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది అనసూయ. మాకు మా తులసి కావాలి.. మారిపోయిన కొత్త తులసి వద్దు అని అంటుంది అనసూయ. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది మరిచిపోదాం. అది సరే కానీ.. దివ్య.. నాకు బోర్ కొడుతోంది. అందరం కలిసి రేపు ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతుంది తులసి.
దీంతో ఎక్కడికి వెళ్దాం అని అందరూ ఫుల్ ఖుషీ అవుతారు. ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు దివ్య అని అడుగుతాడు పరందామయ్య. దీంతో మాల్ కు వెళ్దాం అంటుంది దివ్య. దీంతో తులసి కూడా సరే అంటుంది. మరోవైపు లక్కీ డల్ గా ఉండటం చూసి నందు ఏమైంది అని చూస్తాడు. వీడిని మాట్లాడించాలో.. మాట్లాడించకూడదో నాకు అర్థం కావడం లేదు. కదిలిస్తే ఏం ఆన్సర్ ఇస్తాడో అర్థం కాదు. వీడు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ లా అయిపోయాడు అని అనుకుంటాడు నందు. ఎందుకు వాడిని చూసి డిస్టర్బ్ అవుతున్నాను అని అనుకుంటాడు నందు. ఇంతలో ఏంటి అలా తల గోక్కుంటున్నారు.. తలలో పేలా అని అడుగుతాడు. దీంతో నవ్వుతాడు నందు. అది సరే కానీ.. ఏమైంది.. అంత డల్ గా ఉన్నావు అని అడుగుతాడు నందు. దీంతో నాకు బోర్ కొడుతోంది. బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లు అంటే నేను బిజీగా ఉన్నాను అంటుంది అని చెబుతాడు. దీంతో రేపు నాతో వస్తే నేను నిన్ను షికారుకు తీసుకెళ్తా అంటాడు నందు.
సరే.. నాకు వేరే దారి లేదు అని అనుకుంటాడు లక్కీ. థాంక్స్ కీప్ ఇట్ అప్.. బై.. రేపు వెళ్దాం అంటాడు లక్కీ. మరోవైపు పని నుంచి లేట్ గా వస్తుంది శృతి. బయటే ప్రేమ్ కూర్చొని ఉంటాడు. ప్రేమ్.. అని పిలుస్తుంది. తాళం తీయకుండా ఇక్కడే కూర్చున్నావేంటి.. ఏమైంది అని అడుగుతుంది.
ఎందుకు అలా డల్ గా ఉన్నావు ప్రేమ్.. ఏం జరిగింది అని అడుగుతుంది. దీంతో ఏ బంధానికి అయినా పునాది నమ్మకమే. ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే మనం ఏం చేయలేం కదా అని అడుగుతాడు ప్రేమ్. దీంతో శృతికి డౌట్ వస్తుంది.
Intinti Gruhalakshmi 14 June Today Episode : తులసి ఫ్యామిలీ వెళ్లిన మాల్ కే వెళ్లిన ప్రేమ్, శృతి
ఏమైంది.. అని అడుగుతుంది. మా ఫ్రెండ్ రమేశ్ కు ఇదే సమస్య ఎదురైంది. కొత్తగా పెళ్లి అయింది. వాడి భార్య అతడికి చెప్పకుండా ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది అని తెలిసి వాడు నాకు చెప్పాడు అంటుంది. తప్పదు కాబట్టి చేసి ఉంటుంది కదా అంటుంది శృతి.
పూట గడవనప్పుడు ఆటో డ్రైవింగ్ చేయడం తప్పు కాదు కదా.. అంటుంది శృతి. దీంతో భార్య అలాంటి పని చేస్తుందంటే ఏ భర్తకైనా కోపం వస్తుంది అంటాడు ప్రేమ్. ఇంత చిన్న విషయానికే నీ ఫ్రెండ్ బంధాన్ని తెంపేద్దామనుకుంటున్నాడా అని అంటుంది శృతి.
దీంతో ఈ విషయంలోనే అబద్ధం చెబితే రేపు వేరే విషయం కూడా తన దగ్గర దాయదని నమ్మకం ఏంటి అని అంటాడు ప్రేమ్. దీంతో ఏదో ఒకటి కవర్ చేసి తాళం తీసి ఇంట్లోకి వెళ్తుంది శృతి. తనతో పాటు ఇంట్లోకి వెళ్లిన ప్రేమ్.. కోపం వచ్చిందా అని అడుగుతాడు.
దీంతో ఏం.. ఆడవాళ్లకు కోపం రాకూడదా.. అది కూడా మగవాళ్ల హక్కేనా అంటుంది. నువ్వు ఇలా సీరియస్ గా ఉంటే బాగోలేదు.. ప్లీజ్ నవ్వవా అంటాడు ప్రేమ్. సారీ అంటాడు. రేపు షికారుకు తీసుకెళ్తాను సరేనా అంటాడు. దీంతో సరే అంటుంది శృతి.
మరోవైపు తులసి అండ్ ఫ్యామిలీ మాల్ కు వెళ్తారు. మరోవైపు ఏదో ట్రిప్ కోసం మాల్ లో లక్కీ డ్రా తీస్తుంటే అందులో పార్టిసిపేట్ చేయాలని నిర్వాహకులు తులసి వాళ్లను అడుగుతారు. దీంతో పరందామయ్య తన డిటెయిల్స్ రాసి ఇస్తాడు. తర్వాత అక్కడి నుంచి పైకి వెళ్తారు.
మరోవైపు ప్రేమ్, శృతి కూడా అదే మాల్ కు వస్తారు. మాల్ లో తనకు తులసి కనిపించినట్టుగా అనిపిస్తుంది ప్రేమ్ కు. అమ్మ కనిపించింది అని చెప్తాడు ప్రేమ్. దీంతో ఎక్కడ లేదు కదా అని చెబుతుంది శృతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.