సుజిత్, వినాయక్, హరీష్ శంకర్ ఫెయిల్ అయ్యారా?.. లూసిఫర్ రీమేక్‌పై చిరంజీవి అధికారిక ప్రకటన
మెగాస్టార్ చిరంజీవికి స్క్రిప్ట్ చెప్పి ఒప్పించడం అంత ఈజీగా కాదనే విషయం మరోసారి నిరూపితమైంది. స్క్రిప్ట్‌పై చిరు ఎంత జాగ్రత్తగా ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసేలా చేశాడు. మళయాలంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన లూసీఫర్ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా తెలుగులోనూ డబ్ అయింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అలాంటి చిత్రంపై చిరంజీవి కన్ను పడింది.
వెంటనే రామ్ చరణ్ ఎన్వీ ప్రసాద్‌తో లూసిఫర్ రీమేక్ హక్కులను కొనిపించాడు. ఇన్నాళ్లుగా లూసిఫర్ రీమేక్ దర్శకులపై రకరకాల పుకార్లు వచ్చాయి. సాహోతో స్టైలీష్ మేకర్‌గా నిరూపించుకున్న సుజీత్‌కు మొదటగా అవకాశం వచ్చింది. ఆ తరువాత సుజీత్ సైడ్ అయిపోయాడు. ఆ తరువాత వివి వినాయక్ లైన్‌లోకి వచ్చాడు. వినాయక్ చెప్పిన స్క్రిప్ట్ చిరుకు నచ్చలేదట.
ఆ తరువాత హరీష్ శంకర్‌ను లూసిఫర్ రీమేక్ కోసం అడిగారట. కానీ ఆ వార్తలు కూడా రూమర్లుగానే మిగిలిపోయాయి. చివరకు లూసిఫర్ రీమేక్‌పై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఎడిటర్ మోహన్ తనయుడు జయం మోహన్ రాజా (తమిళ డైరెక్టర్.. ధృవ సినిమా స్టోరీ అందించినవాడు.. తనిఒరువన్ సినిమా దర్శకుడు)ను లూసిఫర్ రీమేక్‌కు ఎంచుకున్నాడు.కొణిదెల ప్రొడక్షన్, ఎన్వీ ప్రసాద్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాదిలో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. మొత్తానికి మన దర్శుకులు చిరును మెప్పించడంలో ఫెయిల్ అయ్యారు.