ఇది మరీ ఓవర్.. మోనాల్‌కు అన్ని లక్షలా?

Authored By Admin | The Telugu News | Updated on : 30 December 2020, 6:30 pm

బిగ్ బాస్ షో పుణ్యమా అని మోనాల్ గజ్జర్ ఉందని తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. అప్పుడెప్పుడో అల్లరి నరేష్ సినిమా ద్వారా పరిచయం అయింది మోనాల్. కానీ తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది మాత్రం బిగ్ బాస్. బిగ్ బాస్ దత్త పుత్రికగా దాదాపు పదమూడు వారాలు సేవ్ చేస్తూనే వచ్చాడు. చివరకు పద్నాలుగో వారంలో టాప్ 6 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. అలా వచ్చిన మోనాల్‌కు మంచి ఆఫర్లే వచ్చాయి.

Monal Gajjar Demand 15 lakshs For Alludu Adhurs Item Song

Monal Gajjar Demand 15 lakshs For Alludu Adhurs Item Song

స్టార్ మాలోనే డ్యాన్స్ ప్లస్ అనే షో ప్రారంభం అయింది. దీంట్లో మోనాల్ ఓ జడ్జ్, మెంటర్‌గా చేస్తోంది. ఇలా బిగ్ బాస్ టీం ముందుగానే మోనాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా మోనాల్‌కు ఐటం సాంగ్ ఆఫర్ వచ్చింది. అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో ఆల్రెడీ ఐటెం సాంగ్ షూటింగ్ ప్రారంభించేసింది. సోనూ సూద్, బెల్లంకొండ శ్రీనివాస్‌లతో కలిసి మోనాల్ స్టెప్పులు కూడా వేసింది.

ఈ పాట కోసం మోనాల్ ఏకంగా 15 ల‌క్ష‌లు డిమాండ్ చేసింద‌ని స‌మాచారం. ఇంత‌కీ ఈ పాట ఉండేది మూడంటే మూడు నిమిషాలే. మోనాల్ అడిగినంత ఇవ్వ‌డానికి నిర్మాత‌లూ రెడీ అయిపోయారు. మొత్తానికి అలా బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ వల్ల మోనాల్ కి దాదాపు 30 ల‌క్ష‌లు గిట్టుబాటు అయ్యాయన్న మాట. ఇంకా మోనాల్ ఖాతాలో ఎన్ని ఆఫర్లు వస్తాయో చూడాలి. కానీ ఈ స్పెషల్ పాటకు మోనాల్ 30 లక్షలు డిమాండ్ చేయడమంటే ఎక్కువే అని టాక్ వినిపిస్తోంది.

Advertisement

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి