Karthika Deepam : దీపను చంపబోయిన మోనితకు షాకిచ్చిన కార్తీక్.. దీపతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయిన కార్తీక్.. సౌందర్య, ఆనందరావును కలుస్తారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam : దీపను చంపబోయిన మోనితకు షాకిచ్చిన కార్తీక్.. దీపతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయిన కార్తీక్.. సౌందర్య, ఆనందరావును కలుస్తారా?

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. కార్తీక దీపం సీరియల్, సోమవారం ఎపిసోడ్ 1508 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాలకు ఇంద్రుడు, చంద్రమ్మ మీద అనుమానం వస్తుంది. అసలు మీరు ఆటో ఎందుకు అమ్మేశారు అని వాళ్లను నిలదీస్తుంది. అమ్మానాన్నలను ఎలా వెతకాలి. వాళ్లను వెతకడానికి ఆటో ఉండాలి కదా.. అంటుంది. దీంతో ముందే చెప్పాను కదా అంటాడు ఇంద్రుడు. ఏది […]

 Authored By gatla | The Telugu News | Updated on :13 November 2022,9:30 am

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. కార్తీక దీపం సీరియల్, సోమవారం ఎపిసోడ్ 1508 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాలకు ఇంద్రుడు, చంద్రమ్మ మీద అనుమానం వస్తుంది. అసలు మీరు ఆటో ఎందుకు అమ్మేశారు అని వాళ్లను నిలదీస్తుంది. అమ్మానాన్నలను ఎలా వెతకాలి. వాళ్లను వెతకడానికి ఆటో ఉండాలి కదా.. అంటుంది. దీంతో ముందే చెప్పాను కదా అంటాడు ఇంద్రుడు. ఏది ఏమైనా మీరు మారిపోయారు అని వాళ్లతో అంటుంది. దీంతో వాళ్లను భయమేస్తుంది. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల. దీంతో జ్వాలమ్మకు మన మీద అనుమానం వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చంద్రమ్మతో చెబుతాడు ఇంద్రుడు.

monitha tries to kill deepa while she performs karthika puja

monitha tries to kill deepa while she performs karthika puja

మరోవైపు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీప గుడిలో దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. మరోవైపు కార్తీక్ ను తీసుకొని మోనిత అదే గుడికి వస్తుంది. కార్తీక్.. ఇవాళ నువ్వు నాతో గుడికి రావడం చాలా సంతోషంగా ఉంది అంటుంది మోనిత. తనతో మాట్లాడుతుండగానే కార్తీక్.. దీపను వెతకడం కోసం అక్కడి నుంచి వెళ్తాడు. దీంతో కార్తీక్ ఎక్కడికి వెళ్లాడు అని టెన్షన్ పడుతుంది మోనిత. ఇంతలో ఒక చోట కనిపిస్తాడు. మనిద్దరం కలిసి దీపాలు వెలిగించాలి అంటుంది మోనిత. కానీ.. గుడిలో చూడు.. ఎవ్వరూ తమ భర్తలతో రాలేదు కదా. అందరూ ఆడవాళ్లే వచ్చి చేస్తున్నారు కదా అని చెప్పి తన కర్చీఫ్ ఇచ్చి ఆ కర్చీఫ్ నే తను అనుకొని పూజ చేసుకో అంటాడు కార్తీక్.

మరోవైపు దీప దీపాలు ముట్టిస్తుండగా.. తన దగ్గరికి వెళ్తాడు కార్తీక్. వచ్చారా డాక్టర్ బాబు అంటుంది దీప. దీంతో కార్తీక దీపం వెలిగిస్తా అన్నావు కదా. ఎందుకు రాను అంటాడు కార్తీక్. శౌర్య త్వరగా మన దగ్గరికి రావాలని కోరుతూ దీపాలు వెలిగిస్తున్నాను అంటుంది దీప.

మరోవైపు ఇద్దరూ కలిసి దీపాలు వెలిగిస్తుండగా చూసి మోనిత షాక్ అవుతుంది. దీంతో ఎలాగైనా ఇవాళ దీప అడ్డు తొలగించుకోవాలని అనుకుంటుంది మోనిత. ఇవాళ సాయంత్రం కార్తీక దీపాన్ని వెలిగించాలి. మీరు వెలిగిస్తే నేను దాన్ని నీళ్లలో వదిలేస్తాను అంటుంది దీప. దీంతో సరే అంటాడు కార్తీక్.

Karthika Deepam : నీ అంతు చూస్తా అని దీపకు వార్నింగ్ ఇచ్చిన మోనిత

ఇద్దరూ ఒకరిని మరొకరు పట్టుకొని నిలుచోవడం చూసి మోనితకు అస్సలు నచ్చదు. చాలా కోపం వస్తుంది. కానీ.. తనను శివలత తీసుకెళ్తుంది. కట్ చేస్తే సాయంత్రం అవుతుంది. అందరూ కార్తీక దీపాలను వెలిగిస్తారు. అందరూ దీపాలను కోనేరులో వదిలేయడానికి వెళ్లగానే ఇవాళ నీ అంతు చూస్తా అని చెబుతుంది మోనిత.

ఈరోజుతో నీ దీపం ఆరిపోతుంది అంటుంది. నీకు రోజులు దగ్గర పడ్డాయి అంటుంది మోనిత. దీంతో ఆ మాట నేను నీతో అనాలి. నాకు రోజులు దగ్గర పడటం కాదు. నీ పాపం పండిపోయింది. ఫలితం అనుభవించడానికి సిద్ధంగా ఉండు అంటుంది దీప.

ఆ తర్వాత దీప దీపాలను కోనేరులో వదిలేందుకు వెళ్తుంది. అక్కడ కూర్చొని దీపాలు కోనేరులో వదులుతుండగా అక్కడికి వెనుక నుంచి వెళ్లిన మోనిత.. దీపను కోనేరులో నెట్టేయబోతుంది. మోనితను చూసిన కార్తీక్ వెంటనే తనను ఆపుతాడు.

ఏంటి.. ఏం చేస్తున్నావు నువ్వు. తన ప్రాణాలు తీయాలనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు కార్తీక్. దీంతో అవును.. నీకు, నాకు మధ్య ఎవరు వచ్చినా వాళ్లను ఉండనివ్వను అంటుంది మోనిత. పిచ్చా నీకు అంటే.. చాలు కార్తీక్ అంటుంది మోనిత.

ఈరోజుతో మీ ఆటలకు ముగింపు పలకాలి. ఈరోజు నుంచి నువ్వు వంటలక్కను కలవకూడదు. మాట్లాడకూడదు అంటుంది మోనిత. వంటలక్కతో మాట్లాడనని నాకు మాటివ్వు అంటుంది. అక్కడే వెలిగించి ఉన్న దీపం మీద ప్రమాణం చేయి అని అందరి ముందే అడుగుతుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది