Samantha : నాలోని శక్తి 50 శాతం తగ్గిపోయింది.. ఆ బాధని వర్ణించలేనంటున్న సమంత...
Samantha : నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని రోజులకి అతని నుండి విడిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి మయోసైటిస్ బారిన పడింది. దీంతో సమంత హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఏడాదిగా సినిమాలు చేయకపోయిన ఆమె పేరు నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా సమంత పేరు తెరపైకి వచ్చింది. యూట్యూబర్, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న రీసెంట్‌గా ఓ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత రుత్ ప్రభు, నాగచైతన్య అక్కినేని విడిపోవడానికి కూడా టెలిఫోన్ ట్యాపింగే కారణమని అన్నారు. అప్పటి అధికార పార్టీలోని కీలక నేత, మందులు ఇచ్చే వ్యక్తి జోక్యం వల్లే వారిద్దరు విడాకులు తీసుకొన్నారని కామెంట్ చేశారు.
అయితే పూర్తిగా వాస్తవాలు తెలుసుకున్న తర్వాత దానిపై మరింత వివరంగా వీడియో చేస్తాను అని తీన్మార్ మల్లన్న అన్నారు. ఇక సమంత ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉన్నా సోషల్ మీడియాలోనో లేదంటే ఇంటర్వ్యూస్ లేదంటే పాడ్ కాస్ట్‌తోనో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా సమంత పాడ్ కాస్ట్‌లో అప్పుడు తను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించింది. మయోసైటిస్ తర్వాత ఎదురయ్యే సైడ్ ఎఫక్ట్స్ ని అధికమించడానికి కూడా సమంతకి చాలా సమయం పట్టిందని తెలియజేసింది. ఆరోగ్యం సహకరించకపోవడం వల్లనే సమంత ఖుషి తర్వాత సినిమాలకి దూరంగా ఉంది.
ఇక సిటాడెల్ వర్క్ షాప్ లో ట్రైనింగ్ సెషన్ నిర్వహించగా, ఆ ట్రైనింగ్ సెషన్ లో నా శక్తి సగానికి తగ్గిపోయిందని తెలియజేసింది. ఆ విషజ్ఞం అప్పుడు నాకు అర్థం అయింది. అయితే భారీ యాక్షన్ సీన్స్ లో నటించాల్సి రావడం,ఒకవైపు మయోసైటిస్, మరోవైపు గాయాలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయని తెలియజేసింది. నా బాడీ త్వరగా హీల్ కావడానికి తక్కువ ఆహారం తీసుకున్నాను. ఆ క్రమంలో నా శక్తి 50 శాతం పడిపోయింది. చాలా రోజుల పాటు సమస్యని ఎదుర్కొన్నా. కండరాల నొప్పులతో కూడా విపరీతంగా బాధపడ్డాను అని సమంత తెలియజేసింది. అయితే సమంత ఇప్పుడు ఆ సమస్యల నుండి పూర్తిగా కోలుకొని త్వరలో తిరిగి సినిమాలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది.
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.