Nag Ashwin : కోట్ల ఆస్తులున్న అశ్వినీద‌త్ కూతురిని సాధార‌ణ వ్య‌క్తి అయిన క‌ల్కి డైరెక్టర్ ఎలా ప‌డేశాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nag Ashwin : కోట్ల ఆస్తులున్న అశ్వినీద‌త్ కూతురిని సాధార‌ణ వ్య‌క్తి అయిన క‌ల్కి డైరెక్టర్ ఎలా ప‌డేశాడు?

Nag Ashwin : మ‌హాన‌టి సినిమాతో మంచి ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఇప్పుడు క‌ల్కి చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్ర‌భాస్, అమితాబ్, దీపికా, క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రంకి భారీ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. చాలా రోజుల తర్వాత థియేటర్లన్నీ కళకళలాడుతుండగా.. కుటుంబ ప్రేక్షకులు భార్యాబిడ్డలతో తరలివస్తున్నారు. తొలి నాలుగు రోజుల్లోనే కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ మేరకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 July 2024,4:00 pm

Nag Ashwin : మ‌హాన‌టి సినిమాతో మంచి ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఇప్పుడు క‌ల్కి చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్ర‌భాస్, అమితాబ్, దీపికా, క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రంకి భారీ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. చాలా రోజుల తర్వాత థియేటర్లన్నీ కళకళలాడుతుండగా.. కుటుంబ ప్రేక్షకులు భార్యాబిడ్డలతో తరలివస్తున్నారు. తొలి నాలుగు రోజుల్లోనే కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎక్స్ ద్వారా ప్రకటించింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ అందించిన నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Nag Ashwin సింపుల్ ల‌వ్..

నాగ్ అశ్విన్ ప్ర‌తిభ‌కు ప్ర‌తి ఒక్క‌రు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ముఖ్యంగా అగ్ర నిర్మాత అశ్వినీదత్ అయితే అల్లుడి ప్రతిభను చూసి పొంగిపోతున్నారు. వైజయంతి బ్యానర్‌లో భారతదేశం గర్వపడే సినిమా తీసినందుకు, అది బ్లాక్‌బస్టర్‌గా నిలిచినందుకు అశ్వినీదత్ సంబరపడిపోతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ దశనే నాగీ మార్చేశారనే అందరూ కితాబిస్తున్నారు. అయితే అటు ధ‌న ప‌రంగా, రాజ‌కీయ ప‌రంగా బ‌ల‌మైన వ్య‌క్తి అయిన అశ్వినీద‌త్‌కి నాగ్ అశ్విన్ ఎలా అల్లుడు అయ్యాడంటూ అంద‌రు చ‌ర్చ కొన‌సాగిస్తున్నారు. నాగ్ అశ్విన్-ప్రియాంక దత్ సామాజిక వర్గాలు కూడా ఒకటి కాదు. చాలా సాదాసీదాగా ఉండే మీరు అశ్వినీ దత్ అల్లుడు ఎలా అయ్యారనే ప్రశ్న ఓ సందర్భంలో నాగ్ అశ్విన్ కి ఎదురైంది.

Nag Ashwin కోట్ల ఆస్తులున్న అశ్వినీద‌త్ కూతురిని సాధార‌ణ వ్య‌క్తి అయిన క‌ల్కి డైరెక్టర్ ఎలా ప‌డేశాడు

Nag Ashwin : కోట్ల ఆస్తులున్న అశ్వినీద‌త్ కూతురిని సాధార‌ణ వ్య‌క్తి అయిన క‌ల్కి డైరెక్టర్ ఎలా ప‌డేశాడు?

అల్ట్రా మోడ్రెన్ సొసైటీలో పుట్టి పెరిగిన ప్రియాంక దత్ మిమ్మల్ని ఎలా ఇష్టపడ్డారు? మీలో ఆమెకు నచ్చిన అంశం ఏమిటీ? ప్రియాంక దత్ తో మీ ప్రేమ కథ ఎలా మొదలైంది? అని అడగడం జరిగింది. మహానటి మూవీ విడుదల తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్… ఈ సందేహాలకు సమాధానం చెప్పాడు. ప్రియాంక దత్ తో నా లవ్ స్టోరీ చాలా సింపుల్. పెద్ద సినిమాటిక్ గా కూడా ఉండదు. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి ముందు నుంచే మాకు పరిచయం ఉంది. కలిసి కొన్ని యాడ్స్ చేశాము. అలా పరిచయం ఏర్పడింది. ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ లో పరిచయం మరింత బలపడింది. జస్ట్ ప్రాక్టికల్ గా ఇద్దరికీ పెళ్లీడు వచ్చింది. ఇంట్లో సంబంధాలు తెస్తే.. నచ్చితే చేసుకుంటాం. ఆ క్రమంలో మనమే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా.. అన్నట్లు మా డిస్కషన్ నడిచింది. ఆ విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము.. అని నాగ్ అశ్విన్ అన్నారు. ప్రియాంక దత్ డౌన్ టు ఎర్త్. సింపుల్ గానే ఉంటార‌ని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది