Naga Babu : ఏపాటి వాడికైనా.. ఆపాటి అసూయ పరిపాటే.. గరికపాటిపై మెగా బ్రదర్ ఎటాక్..!
Naga Babu : తన అన్నదమ్ముల గురించి ఎవరైనా ఏదైనా అంటే నేను ఊరుకునేది లేదని మరీ చెప్పిన మెగా బ్రదర్ నాగబాబు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా సెటైరికల్.. నెగటివ్ కామెంట్స్ చేస్తే వెంటనే ఆయన రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో లేటెస్ట్ గా దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ ప్రోగ్రాం లో చిరంజీవి గారు మీరు ఆ ఫోటోలు దిగడం ఆపేస్తేనే నేను ప్రసంగం ఇస్తానని చెప్పాడు.. ఓ విధంగా అరిచాడని చెప్పొచ్చు. అయితే వెంటనే కమిటీ సభ్యులు ఆయనకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే గరికపాటి గారు ఇలా మాట అన్నారో లేదో ఆన్సర్ మెగా బ్రదర్ నుంచి వచ్చేసింది. ఆయన పేరు ప్రస్థావించకుండా నాగ బాబు వేసిన ట్వీఎట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ నాగబాబు ఏమని ట్వీట్ చేశారు అంటే.. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అని రాసుకొచ్చారు. ఇక్కడ పాటి అంటూ పద ప్రయోగం చేసి మరి ఆయన అంటున్నది ఎవరిని అని క్లారిటీగా చెప్పేశారు నాగ బాబు. అన్నయ్య ని ఎవరైనా టార్గెట్ చేస్తే చాలు వెంటనే తన ప్రెజెన్స్ తో ఆన్సర్ ఇచ్చేస్తాడు నాగ బాబు. ఈరోజు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. అలా గరికపాటి గారు చిరంజీవి ఫోటో సెషన్ మీద గొడవ చేశారో లేదో ఇలా నాగ బాబు తన ట్విట్టర్ వేదికగా రెస్పాన్స్ ఇచ్చారు.

naga babu strong replay to garikapati narasimha rao
ప్రస్తుతం నాగ బాబు అన్నయ్య, తమ్ముడు గురించి ఏమంటున్నారో.. వారిని ఎలా హ్యాండిల్ చేయాలో అనే పనిలో ఉన్నారని చెప్పొచ్చు. ఈమధ్య కొంతకాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్న నాగ బాబు రానున్న ఏపీ ఎలక్షన్స్ లో ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారు. ఆల్రెడీ జనసేన పార్టీకి సపోర్ట్ గా తమ్ముడు పవన్ తోనే తన ప్రయాణం అని చెబుతున్న నాగ బాబు అన్న, తమ్ముడి మీద బయట నుంచి వస్తున్న కామెంట్స్ ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గరికపాటి గారికి నాగబాబు ఇచ్చిన ఆన్సర్ మెగా ఫ్యాన్స్ వరకు ఖుషి చేస్తున్నా ఓ ఉపన్యాసపరుడు.. అవధాని గురించి ఇలా స్పందించడం మెచ్చుకోదగిన విషయం కాదన్నది కొందరి వాదన.
