Naga Chaitanya : ఏదో మొక్కుబడిగా చెప్పినట్టుందే.. సమంత చైతన్యల మధ్య దూరానికి ఇదే నిదర్శనం!
Naga Chaitanya సమంత Samantha, నాగ చైతన్య Naga Chaitanya ల విడాకుల విషయం ఎంతటి హాట్ టాపిక్‌గా మారిందో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారనే విషయాలు బయటకు వచ్చాయి. అంతే కాకుండా ఈ ఇద్దరూ వేర్వేరు ఇంట్లో ఉంటున్నారనే టాక్ వచ్చింది. ఈ మధ్య ముంబైకి సమంత షిఫ్ట్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరూ కూడా విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు వెళ్లినట్టు సమాచారం. ఇలా ఈ ఇద్దరి గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
సమంతను పట్టించుకోని చై Naga Chaitanya
గతంలో అయితే ఇలాంటి పిచ్చి రూమర్లపై సమంత స్పందించేది. మీడియా మీద సెటైర్లు వేసేది. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి రియాక్షన్లు ఇవ్వడం లేదు. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా కూడా విడాకుల విషయం మీద స్పందించడం లేదు. నిన్న లవ్ స్టోరీ ట్రైలర్ మీద సమంత స్పందించింది. విన్నర్ అంటూ.. టీం మొత్తానికి, సాయి పల్లవికి కంగ్రాట్స్ చెప్పింది. కానీ నాగ చైతన్య గురించి ఎక్కడా స్పందించలేదు. కానీ చైతన్య వేసిన ట్వీట్‌పైనే సమంత రియాక్ట్ అయింది.
అయితే నాగ చైతన్య మాత్రం తన లవ్ స్టోరీ ట్రైలర్ మీద స్పందించిన సెలెబ్రిటీలకు వరుసగా రిప్లైలు ఇచ్చాడు. థ్యాంక్స్ నానా అంటూ నాగార్జునకు, సుశాంత్‌కు థ్యాంక్స్ సుశ్ అని ఇలా అందరికీ రిప్లై ఇచ్చాడు. కానీ సమంత వేసిన ట్వీట్‌ను మాత్రం పట్టించుకోలేదు. నిన్న అంతా కూడా రిప్లై ఇవ్వని చైతన్య.. కాసేపటి క్రితమే స్పందించాడు.
అందులో థ్యాంక్స్ సామ్ అని ఏదో సింపుల్‌గా మొక్కుబడిగా రిప్లై ఇచ్చాడు. దాన్ని బట్టి చూస్తే ఈ ఇద్దరి మధ్య దగ్గర చేయలేనంత దూరం పెరిగిందనిపిస్తోంది. మొత్తానికి ఈ విడాకుల విషయం ఏదో ఒక రకంగా రోజూ వార్తల్లో నిలిచేలా ఉంది. దీనిపై ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేగానీ ఈ వార్తలకు అంతం ఉండదు.