Naga Chaitanya : వారసుల ఎంట్రీపై నాగ చైతన్యకు ఊహించని ప్రశ్న.. ఏ సమాధానం ఇచ్చాడంటే!
Naga Chaitanya : అక్కినేని నాగార్జున నట వారసుడు నాగ చైతన్య.. సమంతతో విడాకుల తర్వాత హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన ఏ విషయం గురించి మాట్లాడిన అది నెట్టింట చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవల లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఎన్నో విషయాల మీద స్పందించాడు. జాతీయ మీడియా ఎక్కువగా నాగ చైతన్య పర్సనల్ విషయాల మీదే శ్రద్ద పెట్టినట్టుంది. ఇక ఇందులో భాగంగా నాగ చైతన్య ఓ నాటీ పని గురించి స్పందించాల్సి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కారులో తన ఫ్రెండ్‌తో ముద్దుల్లో తేలిపోతోండగా.. అడ్డంగా బుక్కైనట్టు కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవల ఓ ఇంటర్య్వూలో చైకి నెపోటిజంపై ప్రశ్న ఎదురైంది. దీనిపై అతడు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నెపోటిజం ప్రభావం అనేది బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాన పెద్దగా కనిపించదు. అసలు ఇది ఎందుకు మొదలైందో కూడా అర్థం కావడం లేదు. దీని గురించి నన్ను అడిగినప్పుడల్లా నా అభిప్రాయం ఇదే. ఎందుకంటే మా తాత(అక్కినేని నాగేశ్వరరావు) ఓ నటులే. మా నాన్న(నాగార్జున) కూడా నటుడే. చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరిగాను. వారి ప్రభావం కచ్చితంగా నాపై పడుతుంది కదా! వారిని చూసి నేనూ నటుడి కావాలని ఆశపడ్డాను. వారిని స్ఫూర్తిగా తీసుకుని నటుడిని అయ్యాను. అలా వారు చూపించిన దారిలో నేను నా పని చేసుకుంటూ వెళ్తున్నా.. ఈ జర్నీ అలాగే కొనసాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడి సినిమా రూ.100 కోట్లు సాధించి నా సినిమా రూ.10 కోట్లు సాధిస్తే..
అందరూ తనను ప్రశంసిస్తారు. ఇక దర్శక-నిర్మాతలు అతడినే ముందుగా అప్రోచ్ అవుతారు’ అని అన్నాడు. ఇక సినిమా ఫ్యామిలీ నుండి రావడం వల్ల తనకు బ్రేక్ ఈజీగానే దొరికిందని ఒప్పుకున్న నాగచైతన్య పరిశ్రమలోని పోటీ గురించి ప్రస్తావించాడు. ‘ఈ రంగంలో పోటీ అనేది సమానంగా ఉంటుంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో కొడుకు రేపు పెద్దయ్యాక అతడు కూడా హీరోనే అవుతాడు కానీ, నెపోటిజం పేరు చెప్పి అతడికి అడ్డు చెప్పగలడా’ అంటూ వివరణ ఇచ్చాడు నాగ చైతన్య. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లోనూ నాగ చైతన్య తన తండ్రిలో మన్మథుడనిపించుకుంటున్నాడు. తాత, తండ్రి, కొడుకులు ముగ్గురూ నవ మన్మథులే అని నిరూపించుకున్నారు. ఇక నాగ చైతన్య తన థాంక్యూ విషయంలో జరిగిన తప్పులను ఒప్పుకున్నాడు.