Bangarraju Teaser : బంగార్రాజులో నాగచైతన్య లుక్ అదిరింది..!
Bangarraju Teaser : Naga Chaitanya నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన మూవీ గతంలో రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. దీనితో పాటు నాగార్జున కెరీర్‌లో ఈ మూవీ ఓ మార్క్ సాధించింది. ఇందులో నాగార్జునను కొత్తగా చూపించారు. రమ్యకృష్ణ సైతం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత దీనికి సీక్వెల్‌గా బంగార్రాజు మూవీని నిర్మిస్తున్నారు. కింద సొగ్గాడు మళ్లీ వచ్చాడు అనే క్యాప్షన్‌ను సైతం పెట్టారు. అయితే ఈ మూవీలోనూ పాత క్యారెక్టర్స్‌నే తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది.
Bangarraju Teaser : స్టైలిష్‌గా నాగచైతన్య
కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్ వస్తున్న బంగార్రాజు మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. అయితే నాగచైతన్య Naga Chaitanya బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన టీజర్‌ను మూవీ టీం తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో నాగచైతన్య లుక్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్ చూసి అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సేమ్ సోగ్గాడే చిన్నినాయన మూవీలో నాగార్జున కర్ర స్టైల్‌ను నాగ చైతన్య Naga Chaitanya చేసినట్టు ఈ టీజర్‌లో చూపించారు. అయితే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నాగలక్ష్మి పోస్టర్, బంగార్రాజు ఫస్ట్ లుక్‌కు సంబంధించిన పోస్టర్ సైతం విడుదలవగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

naga chaitanya look released Bangarraju Teaser
జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తు్న్నారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ విషయంలో డైరెక్టర్ సీక్రెట్ మెయిన్‌టెన్ చేస్తున్నాడు. మరి ఇందులో ఎవరెవరు ఎలాంటి రోల్ పోషించారో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగక తప్పదు. ఇటీవలే సామ్ తో విడిపోయిన తర్వాత పూర్తిగా తన మూవీ కెరీర్ పై దృష్టి సారించాడు నాగ చైతన్య. ఆయన నటించిన లవ్ స్టోరీ మూవీ ఇటీవలే విడుదలై హిట్ కావడంతో.. అదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నాడు చై.
