Sobhita Dhulipala : వేశ్య పాత్రలో అక్కినేని కోడలు.. ఆ సీన్స్ చూస్తే తట్టుకోలేరు..!
ప్రధానాంశాలు:
Sobhita Dhulipala : వేశ్య పాత్రలో అక్కినేని కోడలు.. ఆ సీన్స్ చూస్తే తట్టుకోలేరు..!
Sobhita Dhulipala : నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారింది శోభిత ధూళిపాళ్ల. తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శోభిత.. ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలు చేసింది. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత దూళిపాళ్ల.. తన ప్రత్యేకమైన నటనతో టాలీవుడ్ ఆడియన్స్‌ను కూడా మెప్పించింది.

Sobhita Dhulipala : వేశ్య పాత్రలో అక్కినేని కోడలు.. ఆ సీన్స్ చూస్తే తట్టుకోలేరు..!
Sobhita Dhulipala అలా ఎప్పుడు చేసింది..
శోభిత హాలీవుడ్ సినిమా కూడా చేసిందని, అందులో వేశ్య పాత్రలో నటించిందని చాలామందికి తెలియకపోవచ్చు. హాలీవుడ్ మూవీ ‘మంకీ మ్యాన్’లో వేశ్య పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘సీత’ అనే కాల్ గర్ల్ పాత్ర పోషించడం తనకు గౌరవంగా అనిపించిందని చెప్పింది. ఈ పాత్రకు సినిమాలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో తాను ఎంతో ఇంటెన్స్‌గా నటించానని పేర్కొంది.
గత ఏడాది ఏప్రిల్ 5న యుఎస్‌లో విడుదలైన ఈ చిత్రం యుఎస్ లో సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో తన రోల్ చూసి అక్కడి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారని శోభిత స్వయంగా చెప్పడం విశేషం. కాగా, 2024 డిసెంబర్ 4న నాగ చైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని కోడలైంది శోభిత దూళిపాళ్ల. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళి వేడుకలకు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశిర్వదించారు. ఇంట్లో శోభితని బుజ్జితల్లి అని ముద్దుగా పిలుస్తారట నాగ చైతన్య. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి బంధం సాఫీగా సాగుతోంది.